-5 రకాల ప్రకృతి సిద్ద ఉత్పత్తులను మార్కప్ బ్రాండ్ తో ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి -ప్రకృతి సిద్దం పండించే వ్యవసాయ ఉత్పత్తులకు 10% అదనంగా గిట్టుబాటు ధర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించిన నాణ్యమైన, ఆరోగ్య కరమైన సహసిద్ద వ్యవసాయ ఉత్పతులను వినియోగ దారులకు తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చేందుకు మార్కప్ బ్రాండ్ తో ఏ.పి. మార్కుఫెడ్ రూపొందించిన ఐదు రకాల ఉత్పత్తులను రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి గురువారం అమరావతి …
Read More »Latest News
రైతులకు మేలుచేసే నూతన వంగడాలను అవిష్కరించిన వ్యవసాయ మంత్రి
-7 జాతీయ స్థాయిలో,10 రాష్ట్ర స్థాయిలో మొత్తం 17 నూతన వంగడాలు ఆవిష్కరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడితో పాటు నాణ్యత మరియు చీడపీడలను తట్టుకునే 17 రకాల నూతన వంగడాలను రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి గురువారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో ఆవిష్కరించారు. రైతులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే ఈ నూతన వంగడాలను రూపొందించిన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎ.విష్ణువర్థనరెడ్డిని, శాస్త్రవేత్తలను మరియు ఏపి …
Read More »సుబాబుల్,యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు సానుకూలంగా స్పందించిన కంపెనీలు
-పేపర్ మిల్స్ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి చర్చలు సఫలం -దళారుల ప్రమేయం లేకుండా సొమ్మును రైతులకు నేరుగా చెల్లించాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుబాబుల్, యూకలిప్టస్ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు పేపర్ మిల్స్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సుబాబుల్ మరియు డిబార్క్డ్ యూకలిప్టస్ రైతులకు ప్రస్తుతం చెల్లిస్తున్న ధరపై కనీసం రూ.200/- పెంచేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకారం తెల్పడంతో వారితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి జరిపిన చర్చలు సఫలీకృతం అయ్యాయి. దళారుల ప్రమేయం …
Read More »విద్యార్థుల సమగ్రాభివృద్ధికి వినూత్న పథకాలు
-ఇతర గురుకులాల్లో లేని విధంగా ఎస్సీ గురుకులాల్లో ప్రత్యేక కార్యక్రమాలు -ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధనలు -ఆరోగ్యాల పరిరక్షణకు సునిశిత పరీక్షలు -ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణలు -మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఇతర గురుకులాల్లో లేనివిధంగా ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులకు విద్య, వైద్యం, ఆరోగ్యాల మెరుగుదల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. విద్యార్థులతో పాటుగా అధ్యాపకుల వికాసానికి అవసరమైన ప్రత్యేకమైన చర్యలు కూడా చేపట్టామని …
Read More »అన్నదానం మహా పుణ్యకార్యం
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దానాలలోకెల్లా అన్నదానం ఉత్తమమైనదని.. అన్నదానాన్ని మించిన పుణ్యకార్యం లేదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మధురానగర్లోని భగవాన్ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరాన్ని గురువారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ఒక సేవాకార్యమే కాక మానవుని కనీస ధర్మమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. అన్నదాతను …
Read More »మొక్కల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచి
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలు నాటడాన్ని ప్రతీ పౌరుడు తన సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మధురానగర్ U.V నరసరాజు రోడ్డు కృష్ణుడు గుడి వద్ద మొక్కలు నాటు కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మానవాళి మనగడ పచ్చదనం పరిఢవిల్లితేనే సాధ్యమవుతుందన్న విషయాన్ని బాధ్యతగల పౌరులందరూ గ్రహించాలని కోరారు. ప్రకృతిని ప్రేమించడం, …
Read More »రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 61.84 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సెంట్రల్ లో రోడ్ల పునరుద్ధరణ పనులు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో శరవేగంగా జరుగుతున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శ్రీనగర్ కాలనీ, టీచర్స్ కాలనీలలో రూ. 61.84 లక్షల విలువైన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, యూజీడీ నిర్మాణ పనులకు …
Read More »ప్రజల ఆశీస్సులే జగనన్నకు కొండంత బలం
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -24వ డివిజన్ 92 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజల ఆశీస్సులే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొండంత బలమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గురువారం 24 వ డివిజన్ 92 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి …
Read More »గడపగడపలో నవరత్నాల హరివిల్లు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి గడపలో సంతోషాలు నిండాయని,వారి లోగిళ్ళు నవరత్నాల హరివిల్లు తో విరాజిల్లుతున్నయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సంతోషం వ్యక్తం చేశారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ 26వ సచివాలయం పరిధిలోని గుణదల పడవల రేవు సెంటర్, దేవినేని నగర్ కొండంచు ప్రాంతాల్లో నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు …
Read More »ఈనెల 15 నుండి 29 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు వెల్లూరు జిల్లా కేంద్రం క్రీడా ప్రాంగణం నందు ఈనెల 15 నుండి 29 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రిక్రూటింగ్ ఆఫీస్ (HQs), చెన్నై కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థుల కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఈనెల 15 నుండి 29 వరకు నిర్వహించటం జరుగుతుందని, అభ్యర్థులు, “అగ్నివీర్ (పురుషులు), అగ్నివీర్ (మహిళా మిలిటరీ పోలీస్), సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్ (వెటర్నరీ) …
Read More »