Breaking News

అన్నదానం మహా పుణ్యకార్యం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దానాలలోకెల్లా అన్నదానం ఉత్తమమైనదని.. అన్నదానాన్ని మించిన పుణ్యకార్యం లేదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మధురానగర్లోని భగవాన్ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరాన్ని గురువారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ఒక సేవాకార్యమే కాక మానవుని కనీస ధర్మమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. అన్నదాతను భగవత్ స్వరూపునిగా భావిస్తారని.. మానవజన్మ సార్థకం కావాలంటే ప్రతిఒక్కరూ చేతనైనంత వరకు సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కొంగితల లక్ష్మీపతి, పెనుమత్స శిరీష సత్యం, ఆలయ గౌరవ అధ్యక్షురాలు పిల్లి లక్ష్మీ తులసి, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై సీఎం సానుకూలం : మంత్రి నారాయణ

-సీఆర్‌డీఏ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శితో వెంటనే మాట్లాడుతా : నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *