Breaking News

ఈనెల 15 నుండి 29 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తమిళనాడు వెల్లూరు జిల్లా కేంద్రం క్రీడా ప్రాంగణం నందు ఈనెల 15 నుండి 29 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రిక్రూటింగ్ ఆఫీస్ (HQs), చెన్నై కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థుల కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఈనెల 15 నుండి 29 వరకు నిర్వహించటం జరుగుతుందని, అభ్యర్థులు, “అగ్నివీర్ (పురుషులు), అగ్నివీర్ (మహిళా మిలిటరీ పోలీస్), సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్ (వెటర్నరీ) మరియు నుండి సైన్యంలోకి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు www.joinindianarmy.nic.in వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవాలని, హాజరయ్యే సమయంలో ఖచ్చితమైన ద్రువపత్రాలు తో హాజరు కావాల్సి వుంటుందని, దళారులను నమ్మరాదని ఎంపిక అర్హత మేరకు పారదర్శకంగా ఉంటుందని ఆ ప్రకటనలో తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *