Latest News

పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అగ్రగామి

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు.. దేశంలో మన రాష్ట్రంలోనే అధికమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శనివారం గులాబీతోటలోని 200 సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో కలిసి ఆయన ఇంటింటికీ పింఛన్లను పంపిణీ చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ఏపీలో వైఎస్సార్ పెన్షన్‌ కానుక పథకాన్ని …

Read More »

సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా జగనన్న పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి లో అగ్రగమిగా నిలిపి సంక్షేమ పథకాల అమలులో వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో మిగతా ముఖ్యమంత్రిలకు ఆదర్శంగా నిలిచారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఈ మూడేళ్ళలో ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి …

Read More »

శ్రీ విజయకీలాద్రి దివ్య క్షేత్రం పై శరన్నవరాత్రి ఉత్సవాలు…

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు జిల్లా సీతానగరం శ్రీ విజయకీలాద్రి దివ్య క్షేత్రం పై మరియు వేద విశ్వవిద్యాలయం నందు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు మరియు శ్రీశ్రీశ్రీ అహోబిల జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈరోజు ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవములలో భాగంగా. 6వ రోజున ఉదయం ధాన్యలక్ష్మి అమ్మవారికి 9 కలశాలతో అభిషేకం, అలంకరణ, ద్వార తోరణ ధ్వజ కుంభారాధన, ధాన్యలక్ష్మి ఆరాధన, శ్రీయాగం, పండితోత్తములచే చతుర్వేద, ఇతిహాస, పురాణ స్తోత్ర దివ్య ప్రబంధ పారాయణములు, అనంతరం …

Read More »

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ శనివారం సతీ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈవో ఎవి ధర్మారెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి కె మిశ్రా కూడా వీరితో పాటు స్వామి వారిని దర్శించుకున్నారు.

Read More »

వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఫిజియోథెరపీ…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయనం కేంద్రం వారు “వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఫిజియోథెరపీ’ అనే అంశంపై మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈనెల 28 నుండి 30 సెప్టెంబర్ 2022వ తేదీల్లో శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం అలిపిరి రోడ్డు తిరుపతి లోని వృద్ధులకు నిర్వహించారు వృద్ధులకు నిర్వహించారు. మహిళా అధ్యయన కేంద్రం లెక్చరర్ డాక్టర్ కే .రాణి వృద్ధాశ్రమంలోని వృద్ధులను ఉద్దేశించి కౌన్సిలింలో భాగంగా వృద్ధాశ్రమంలో వృద్ధులందరూ ఒకే కుటుంబంల కలిసిమెలిసి ప్రతి పరిస్థితుల్లోనూ సర్దుకుపోతూ సామరస్యంతో …

Read More »

హిందీ పక్షోత్సవాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: దేశ ప్రజలందరినీ సమైక్యంగా ఉంచడంలో హిందీ భాష ముఖ్య భూమిక వహిస్తుందని ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ అన్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన హిందీ పక్షోత్సవ ముగింపు సభకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరూ హిందీలో పని చేయడం ద్వారా రాజభాషణ గౌరవించాలని సూచించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సహాయ ప్రొఫెసర్ ఆచార్య కాకాని శ్రీకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరంలో ప్రజలందరినీ ఏకతాటిపై …

Read More »

బ్యానర్లు, పోస్టర్స్ అంటించే సంస్థలకు భారీ మొత్తంలో అపరాధ రుసుం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరంలో అనధికారికంగా బ్యానర్లు, పోస్టర్స్ అంటించే సంస్థలకు భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రోడ్ల విస్తరణ పనులు కూడా వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాలిక, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగరంలో ఇష్టానుసారంగా బ్యానర్లు కడుతున్నారని, అటువంటి సంస్థలకు భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించి, …

Read More »

రైతుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభూత్వ లక్ష్యం..

-రైతుల ఆర్థిక భరోసాకు ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రా లు  ఏర్పాటు… -వ్యవసాయాన్ని పండగ చేసిన జగనన్న ప్రభుత్వం -రాష్ట్ర హోమ్ మంత్రి, తానేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త: రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారి అభి వృద్ధి కాంక్షిస్తూ ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రా లు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక ఎదుగుదలకు భరోసానిస్తుందని రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం చాగల్లు గ్రామం లో రు.21.5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన …

Read More »

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తొలి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ  సమావేశం

-బాల కార్మిక వ్యవస్థ లేకుండా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలి -జిల్లా, మండల స్థాయి లో నూతన కమిటీలు ఏర్పాటు -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అధికారులు కార్యచరణతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పై తొలి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ …

Read More »

జిల్లా రెవెన్యూ అధికారి బాధ్యతలు కీలకం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లా సమగ్ర అభివృద్ధి, అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం సాధించడం లో జిల్లా రెవెన్యూ అధికారి బాధ్యతలు కీలకం అని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి గా బాధ్యత లు స్వీకరించిన జీ. నరసింహులు జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వం కలిసి మొక్కను అందచేశారు. తూర్పు గోదావరి జిల్లా కు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమితులైన జి. నరసింహులు శనివారం విధుల్లో జాయిన్ అయ్యారు. శనివారం …

Read More »