Breaking News

Latest News

దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పోతిన వెంకట మహేష్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: దసరా ఉత్సవ ఏర్పాట్లను జనసేన పార్టీ అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు మరియు నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మహేష్  మాట్లాడుతూ దసరా ఉత్సవ ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయం లేదు. క్యూలైన్ల ఏర్పాటు కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. సామాన్య భక్తులకు భోజన వసతి మరియు లిఫ్ట్ సౌకర్యం కల్పించాల్సిందే. పోలీస్ ,రెవెన్యూ మరియు ఇతర శాఖలకు చెందిన సిబ్బందికి రోజు …

Read More »

స్వచ్ఛత అమృత్ మహోత్సవం లో భాగంగా కార్పొరేషన్ వివిధ పోటీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: స్వచ్ఛత అమృత్ మహోత్సవం లో భాగంగా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ వివిధ పోటీలను నిర్వహిస్తుంది. ఈ పోటీలు 26 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 1 వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపింది. నగర స్వచ్చత పైన ప్రజలకు అవగాన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకే విజయవాడ కి స్వచ్ఛత లో 3వ ర్యాంకు వచ్చిందని, దాన్ని మరింత మెరుగు పరిచేలా ప్రజలు తమ …

Read More »

వివిధ శాఖల సమన్వయంతో మలేరియ వ్యాప్తిని నిర్మూలనకై సమిక్ష…

-జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఐ.ఏ.ఎస్, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం లో శనివారం సాయంత్రం జిల్లా వైద్య శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ, ఇరిగేషన్ శాఖ, పంచాయితీరాజ్ శాఖలతో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఐ.ఏ.ఎస్, సమావేశం నిర్వహించినారు. ముఖ్యంగా జక్కంపూడి కాలనీ లో మలేరియా వ్యాప్తి కంట్రోల్ చేయడానికి సమావేశం నిర్వహించినారు. బుడమేరు లో ఉన్నటువంటి గుర్రపు డెక్కను నిర్మూలించాలి, అలాగే దోమల లార్వా నిర్మూలనకై చర్యలు తీసుకోవాలని, అలాగే …

Read More »

వాణిజ్య సముదాయాలలో ఖాళిగా ఉన్న షాపులను భర్తి చేయాలి…

-న‌గ‌ర పాల‌క సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి 23 వ డివిజన్ నందు ఎన్.టి.ఆర్ కాంప్లెక్స్ మరియు 32 వ డివిజన్ అయోధ్య నగర్, లో గల నూతనంగా నిర్మించిన వై.యస్.ఆర్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ను పరిశీలించి వాటికీ సంబందించిన వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ముందుగా ఎన్.టి.ఆర్ కాంప్లెక్స్ ను సందర్శించి అక్కడ గల షాపుల వివరాలు మరియు …

Read More »

పారిశుధ్య వారోత్సవాలలో ప్రజలు భాగస్వాములు కావాలి…

-అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: స్వచ్ఛ అమృత్ మహోత్సవం లో భాగంగా సర్కిల్-1 పరిధిలోని 55వ డివిజన్, చిట్టినగర్ కె.ఎల్.రావు నగర్ నందు ఎర్రకట్ట డౌన్ వి.ఎం.సీ. పార్క్ వద్ద అదనపు కమిషనర్ (జనరల్) శ్యామల, జోనల్ కమిషనర్ -1 కె.టి. సుధాకర్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు. రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యర్థులతో కలిసి ఆరోగ్యమే మహాభాగ్యం, ప్లాస్టిక్ వద్దు గుడ్డ సంచిలు ముద్దు అనే నినాదాలతో స్వచ్ఛత ర్యాలీ చేపట్టారు. ఎర్ర కట్ట డౌన్ …

Read More »

‘సుకన్య’ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో (అమ్మాయిలను సంరక్షించండి వారిని విద్యావంతులను చేయండి) నినాదంతో బాలికల రక్షణ, సమృద్ధిలో భాగం గా ప్రారంభించిన సేవింగ్ కమ్ ఇన్వెస్టిమెంట్ పథకం సుకన్య సమృద్ధి యోజ న పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎడ్యుకేషన్ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. బెంజిసర్కిల్ సమీపంలోని ఓ హోటల్లో శుక్రవారం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సుకన్య సమృద్ధి మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅ తిథిగా పాల్గొని ఖాతాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా …

Read More »

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ప్రభుత్వం మంజూరు చేసిన తమకు చెందిన భూమిని తన బాబాయ్ ఆయన భార్య పేరుతో పూలింగ్ కు ఇచ్చి సంబంధిత బెనిఫిట్స్ ను బదిలీ చేసుకున్నాడని తుళ్లూరు మండలం, లింగాయపాలెం గ్రామానికి చెందిన ఐనవోలు చంటిబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1973లో మా తండ్రికి 2.89 సెంట్ల వ్యవసాయ భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. సంబంధిత పత్రాలన్నీ మా వద్ద ఉన్నాయి. కుటుంబ …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో యూకే మరియు యూరప్ దేశాలలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త: యూకే మరియు యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పది (10) నగరాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. యూకే మరియు యూరప్ దేశాలలో “శ్రీనివాస కళ్యాణోత్సవం” పోస్టర్లను తితిదే అధ్యక్షులు వై.వి. సుబ్బారెడ్డి, APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తిరుమలలో ఈరోజు (23.09.22) ఆవిష్కరించారు. అనంతరం వై.వి. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి …

Read More »

మూడో ఏడాది వైయస్సార్‌ చేయూత…

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త: వరుసగా మూడో ఏడాది వైయస్సార్‌ చేయూత కార్యక్రమాన్ని శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4949 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ … దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నాం. చిక్కటి చిరునవ్వులు, ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచిపెడుతున్న ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడుకి, …

Read More »

రెండవ ఏడాది వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాలు…

-అచీవ్‌మెంట్ అవార్డులు-2022 ఎంపికకు అభ్యర్డుల నుండి దరఖాస్తుల స్వీకరణ -సెప్టెంబర్ 30వ తేదీలోగా దరఖాస్తుల స్వీకరణకు గడువు -నవంబర్ 1న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రదానం -అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు రాష్ట్రస్థాయిలో హై పవర్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు -వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనపరిచిన వ్యక్తులు, సంస్థలకు పురస్కారాల్లో ప్రాధాన్యం -సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …

Read More »