విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దసరా ఉత్సవ ఏర్పాట్లను జనసేన పార్టీ అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు మరియు నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ దసరా ఉత్సవ ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయం లేదు. క్యూలైన్ల ఏర్పాటు కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. సామాన్య భక్తులకు భోజన వసతి మరియు లిఫ్ట్ సౌకర్యం కల్పించాల్సిందే. పోలీస్ ,రెవెన్యూ మరియు ఇతర శాఖలకు చెందిన సిబ్బందికి రోజు కు 180 రూపాయలతో భోజనం ఏర్పాట్లు సామాన్య భక్తులకు 20 రూపాయలతో సాంబార్ అన్నం ఇదెక్కడి న్యాయం.కళా వేదిక ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉంది.దుర్గా ఘాట్ లో జల్లు స్నానాలు సరిగ్గా పనిచేయడం లేదు. దుర్గా ఘాట్ లోమహిళ భక్తులు బట్టలు మార్చుకునేందుకు సరైన ఏర్పాట్లు చేయలేదు. అంతరాలయం బయట ఉచిత దర్శనం క్యూ లైన్ లో సామాన్య భక్తులకు ఉక్కపోత తప్పదు ఫ్యాన్లు సరిగా పనిచేయడం లేదు ఫ్యాన్లు సంఖ్య సరిపోదు. ఈ కార్యక్రమంలో అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు నారంశెట్టికుర్మా రావు, కరిమికొండ శివరామ కృష్ణా, బుద్ధన ప్రసాద్ , రాళ్ల పూడి గోవింద్ , పుల్లారావు, శానంపూడి శిరీష , రమాదేవి, ఉదయ లక్ష్మి , విజయలక్ష్మి, సుజాత రావు, కాంత కుమారి, విజయవాడ నగర అధికార ప్రతినిధి ముద్దాన స్టాలిన్ శంకర్, 37, 38, 53 డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీల కరుణాకర్, సిగనంశెట్టి రాము, పొట్నూరి శ్రీనివాస్, విజయవాడ నగర సంయుక్త కార్యదర్శి గన్ను శంకర్, మరియు జనసేన పార్టీ నాయకులు నామాల కార్తీక్, నోటచర్ల పవన్ కళ్యాణ్, తమ్మిన అరవింద్, సోమీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News