విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని ప్రతి పేదవాడి అభివృద్ధి ప్రధాన అజెండా గా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది అని, ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుని ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ 14వ సచివాలయం పరిధిలోని కఆంజనేయస్వామి గుడి రోడ్, గోపాల కృష్ణయ్య స్ట్రీట్,గుత్తకొండ ధనుంజయ్ స్ట్రీట్, ఓం నమశివాయా స్ట్రీట్, కడియాల కృష్ణయ్య స్ట్రీట్ ప్రాంతాలలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ నాయకులు, సచివాలయ సిబ్బంది తో కలిసి ఇంటింటికి పర్యటించి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ కరెన్సీ నగర్ లో వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్ళ కాలంలోనే రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని అన్నారు. నాడు దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు రోడ్లు వేశారని తరువాత దాదాపు 15ఏళ్ళు ఏ ప్రభుత్వం కూడా ఈ కాలనీ అభివృద్ధి పట్టించుకోలేదు అని,కానీ ఈ మూడేళ్ళ కాలంలో దాదాపు 2కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి కొత్త రోడ్లు మొదలుపెట్టి కొన్ని పూర్తయ్యాయి అని,మరికొన్ని నిర్మాణం లో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతం అనేది మాకు వ్యక్తిగతంగా దగ్గర వుండే ప్రాంతం అని అందుకే ప్రత్యేక శ్రద్ధ పెట్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు,ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్ననని అవినాష్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇంకెవరైన సంక్షేమ పథకాలు అందని వాళ్ళు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే వారికి అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,3వ డివిజన్ కార్పొరేటర్ భిమిశెట్టి ప్రవల్లిక,కో ఆప్షన్ మెంబెర్ ముసునూరు సుబ్బారావు, వైస్సార్సీపీ నాయకులు ఏలూరి శివాజీ, కృష్ణ ప్రసాద్, మురళి కృష్ణ,రాంబాబు, విశేశ్వరరావు, భయన బాబ్జి, నాగేశ్వరావు, నాంచారయ్య, చలపతి రావు, రవి, డేవిడ్ రాజు, భమిశెట్టి నాని తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News