Breaking News

వాణిజ్య సముదాయాలలో ఖాళిగా ఉన్న షాపులను భర్తి చేయాలి…

-న‌గ‌ర పాల‌క సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి 23 వ డివిజన్ నందు ఎన్.టి.ఆర్ కాంప్లెక్స్ మరియు 32 వ డివిజన్ అయోధ్య నగర్, లో గల నూతనంగా నిర్మించిన వై.యస్.ఆర్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ను పరిశీలించి వాటికీ సంబందించిన వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ముందుగా ఎన్.టి.ఆర్ కాంప్లెక్స్ ను సందర్శించి అక్కడ గల షాపుల వివరాలు మరియు ఇతర వాణిజ్య సముదాయాల వివరాలు వాటి యొక్క ఆదాయ వనరులు మొదలగు అంశాలను ఎస్టేట్ అధికారులను అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్భంలో కాంప్లెక్స్ నందలి షాపుల ముందు ఉన్న ప్రకటన బోర్డు తిసివేయలని లేని యెడల వారికి ప్రకటన టాక్స్ వేయాలని కమిషనర్ ఆదేశిస్తూ, కాంప్లెక్స్ లలో గల మిగిలి ఉన్న ఖాళి షాపులను భర్తి చేసి ఆదాయ వనరులు పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా కాంప్లెక్స్ నందలి పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచే విధంగా చూడాలని, ఇంకను ఏమైన సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించాలని సూచించారు. తదుపరి అయోధ్య నగర్ లో నూతనంగా నిర్మించిన వై.యస్.ఆర్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ను ఈ రోజు విడదల రజిని, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు చే ప్రారంభోత్సవం కార్యక్రమం ఏర్పాటుల పనులను యొక్క పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, ఎస్టేట్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, హెల్త్ ఆఫీసర్లు మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *