విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిరువ్యాపారులకు, స్వయం ఉపాధి పొందే వారికి సంవత్సరానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ వారికి నిలబడిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం పటమట జిల్లా పరిషత్ స్కూల్ వద్ద దాదాపు 600 మంది పేద విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు ప్రయాణించేలా ఉచిత బస్ పాస్ లను దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవినాష్ …
Read More »Latest News
పాలిటెక్నిక్ సీట్ల కేయింపుపై ఆగస్టు 20న విద్యార్ధులకు నేరుగా చరవాణి సందేశం
-సాంకేతిక విద్య శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: పాలిటెక్నిక్ సీట్ల కేయింపుపై ఆగస్టు 20న ఎస్ఎంఎస్ రూపంలో విద్యార్ధులకు నేరుగా చరవాణి సందేశం పంపనున్నామని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు సాంకేతిక విద్యాశాఖలో సంస్కరణలకు పెద్దపీట వేస్తామన్నారు. 2010 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి నాగరాణి ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో సాంకేతిక విద్యాశాఖకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నగరంలోని సాంకేతిక విద్యా …
Read More »సమగ్ర సర్వేను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలి… : సి ఎస్ అజయ్ కల్లం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: సమగ్ర సర్వేను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు, జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష పథకం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ చైర్మన్ అజయ్ కలాం అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో.. “జగనన్న శాశ్విత భూ హక్కు – భూ రక్ష” పథకంలో భాగంగా చేపడుతున్న రీసర్వే అమలు తీరు, పురోగతిపై.. రాష్ట్ర సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల కమీషనర్ సిద్దార్థ్ …
Read More »శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషన్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ శ్రీ హరిచందన్ ఒక సందేశం విడుదల చేస్తూ భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణ భగవానుడు అందించిన శాశ్వతమైన సందేశాన్ని కృష్ణాష్టమి పండుగ మనకు గుర్తు చేస్తుందన్నారు. సామరస్య పూర్వకమైన సమాజ నిర్మాణానికి పునాదిని ధృవీకరిస్తుందన్నారు. ఈ శుభ సందర్భం శాంతి, ప్రగతి, శ్రేయస్సుకు నాంది కావాలని, రాష్ట్ర ప్రజల మధ్య సోదర, సౌభ్రాతృత్వం, సామరస్య బంధాలను మరింత …
Read More »న్యాయస్థాన భవన సముదాయ ప్రారంభోత్సవం సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమీక్ష…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సివిల్ కోర్టు ప్రాంగణం లో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయస్థాన భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇతర వి.వి.ఐ.పి.లు/ వి.ఐ.పి.లు శనివారం హాజరవుతారు కావున న్యాయస్థాన భవన సముదాయం వద్ద కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన భద్రత చర్యలు …
Read More »కొత్త ప్రభుత్వ ఆసుపత్రి భద్రత పై ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన డి.సి.పి. ఏ.బి.టి.ఎస్. ఉదయ రాణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: కొత్త ప్రభుత్వ ఆసుపత్రి లో కట్టు దిట్టమైన భద్రత మరియు భద్రతా పరంగా ఎటువంటి లోపాలు తలెత్తకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన భద్రత చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.యస్ ఆదేశాల మేరకు సి.ఎస్.డబ్ల్యు.డిప్యుటీ పోలీస్ కమీషనర్ ఎ.బి.టి.ఎస్. ఉదయ రాణి బుధవారం మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రి కాన్ఫరెన్సు హాలు నందు దిగువ తెలిపిన శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా …
Read More »ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆగస్టు 17 నుండి 19వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 17వ తేదీ సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి …
Read More »తిరుమలలో ఆగస్టు 19న గోకులాష్టమి ఆస్థానం, 20న ఉట్లోత్సవం
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 19వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. ఆగస్టు …
Read More »వంద ఎకరాలు పైబడిన లేఅవుట్ల వద్ద టెక్సుటైల్ పార్కులు
-రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: వంద ఎకరాల పైబడిన లేఅవుట్ల వద్ద టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం, ఐ.టి. శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పరిశ్రమల శాఖ సమావేశ మందిరంలో చేనేత, వస్త్రపరిశ్రమ, ఆప్కో, లేపాక్షి మరియు ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »జగనన్న విదేశీ విద్యా దీవెన కొత్త పథకం
-అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దీంతో సంబంధం లేదు -ఈ రెండు పథకాలు ఒకటేనని టీడీపీ చేస్తున్న ప్రచారం నిజం కాదు -మంత్రి మేరుగు నాగార్జున స్పష్టీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేసారు.అవాస్తవాలు అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజలను గందరగోళానికి గురి చేసి …
Read More »