-2024-25 అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వ విద్యాలయ టెంపరరీ స్టాఫ్, కౌన్సిల్, స్టూడెండ్స్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో శుక్రవారం టెంపరరీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ పార్ట్ టైం ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ కె.ఈరన్న మీడియాతో మాట్లాడుతూ జూన్ 2వ తారీఖు కి పదవ షెడ్యూల్ పూర్తయిందని, ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం అడ్మిషన్లకు ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఏపీకి అడ్మిషన్లు ఇవ్వమని చెప్పింది అన్నారు. ఏపీలో డబ్భై ఆరుమంది అటెండర్లు,ఆరు వందలమంది పార్ట్ టైం ఎంప్లాయిస్, రెండు లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ఈ సమస్యకు సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం1992 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విద్యాలయంగా రూపాంతరం చెంది రాష్ట్ర విభజన తర్వాత అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని,2024-25 విద్యా సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ లో అడ్మిషన్లు నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం,అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకొని ఇంకా కోర్సు పూర్తి చేయని విద్యార్థులు సుమారుగా రెండు లక్షల మంది ఈ నిర్ణయంతో ఇబ్బందులకు గురవుతారని, ఏపీ విద్యార్థులు,ఇబ్బంది పట్ల తెలంగాణ లోని అధికారులు సవతి తల్లి ప్రేమ చూపుతున్నప్పటికీ 12 వేల మంది విద్యార్థులు చేరడం జరిగింది,గడిచిన మూడు సంవత్సరాలుగా అభ్యాసక సహాయ కేంద్రాల్లో పని చేస్తున్న పార్ట్ టైం సిబ్బందికి జీతాలు కూడా నిలిచిపోయి అనేక ఇబ్బందులు, కష్టాలు పడ్డాక ఎట్టకేలకు జీతాలు అందాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కె.ఈరన్న (జె.ఎ.సి.టి), ఎస్.రామచంద్రరావు (జె.ఎ.సి.టి), కె.జ్యోతి (అటెండర్), అమర్నాథ్ రెడ్డి (జె.ఎ.సి.టి), బి ఆదినారాయణ రావు (అటెండర్) తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News