-స్విమ్స్ ఆసుపత్రి నందు క్షతగాత్రులకు ఇచ్చిన హామీ మేరకు తమని తమ స్వంత ప్రాంతాలకు వాహనాలలో పంపిస్తూ మరియు శ్రీ వారి దర్శన భాగ్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మనసారా కృతజ్ఞతలు తెలిపిన క్షతగాత్రులు
-క్షతగాత్రులను శ్రీవారి దర్శనం అనంతరం వారి వారి స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి పంపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నిన్నటి గురువారం పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులైన తమని తమ స్వంత ప్రాంతాలకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పంపిస్తూ మరియు తిరుమల శ్రీ వారి దర్శన భాగ్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వారు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులై స్విమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం వారిని తమ స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు జిల్లా కలెక్టర్ తిరుపతి మునిసిపల్ కమిషనర్ మౌర్య తో కలిసి దగ్గరుండి శుక్రవారం వారిని పంపించారు.
స్విమ్స్ ఆస్పత్రి నుంచి 32 మంది డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం ఐదు మంది ఇంకా చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని సాయంత్రం వారిని వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి స్విమ్స్ ఆసుపత్రి నందు క్షతగాత్రులను స్వయంగా పలకరించి గాయపడిన వారందరికీ వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాటు చేయించి, ప్రత్యేక వాహనాల్లో వారిని వారి స్వంత ప్రాంతాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేయించినందులకు వారికి తమ మనసార ధన్యవాదాలు తెలిపారు.
అలాగే దగ్గరుండి అన్ని సౌకార్యాలు వైద్య, వాహన, భోజన ఏర్పాట్లను చేసి తమను తమ స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి పంపించిన జిల్లా కలెక్టర్ కి తమ ప్రత్యేక ధన్యవాదాలు క్షతగాత్రులు తెలిపారు. వారిని సురక్షితంగా వారి స్వగ్రామాలైన విశాఖపట్నం విజయనగరం, హైదరాబాద్ కడప, తిరుపూర్, కోయంబత్తూర్ లకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి మునిసిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్యతో కలిసి జిల్లా కలెక్టర్ స్వయంగా వాహనాల దగ్గరకు వచ్చి బాధితుల బాగోగులను తెలుసుకొని జాగ్రత్తగా వెళ్లాల్సినదిగా తెలుపుతూ వారికి అవసరమైన మొత్తం వైద్య సేవలను ప్రభుత్వమే సమకూరుస్తుందని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడి వారికి ధైర్యంగా ఉండాలని తెలిపారు. బస్సు ఏర్పాటుతో వారితో పాటు ఒక రెవెన్యూ అధికారిని పంపుతూ, నాలుగు ఇన్నోవా వాహనాలను ఏర్పాటు చేసి వారిని వాహనాలలో వారి స్వంత ప్రాంతాలకు జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి పంపించారు.
Prajavartha Online Telugu News