Breaking News

Latest News

ఈ నెల 16న పోలవరం ప్రాంతంలో జరిగే అఖిలపక్ష పర్యటన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఆదివారం  విజయవాడ దాసరి భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణమూర్తిలతోపాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ కె.నారాయణ జాతీయ రాజకీయ పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించగా, సమావేశం పలు అంశాలపై చర్చలు జరిపింది. సమావేశ నిర్ణయాలతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ …

Read More »

పౌరోహిత్యాన్ని కుల వృత్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు కలిసారు. పౌరోహిత్యాన్ని కుల వృత్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని, తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతిపత్రం అందజేసారు. కులవృత్తిగా గుర్తించడం ద్వారా తమకు భద్రత, భరోసా లభిస్తుందని, అన్ని సంక్షేమ పథకాలకి అర్హులు అవుతామని సమాఖ్య సభ్యులు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన …

Read More »

పలు స్థానిక సమస్యలు సత్వరం పరిష్కరించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే  కార్యాలయంలో  శాసనసభ్యులు మల్లాది విష్ణు ని గులాబీతోట రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసారు. రోడ్డు వైడనింగ్ పనులు చేపట్టాలని, పార్క్ లో మహిళల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయటంతో పాటు పలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే  దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు, స్థానిక కార్పొరేటర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని మల్లాది విష్ణు  హామీ ఇవ్వటంతో రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ని కలిసిన …

Read More »

పోతిన వెంకట మహేష్ ను కలిసి అభినందనలు తెలిపిన నగరాల యువత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా పోతిన వెంకట మహేష్ కి వంద మందికిపైగా నగరాల యువత వచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2024 లో పోతిన వెంకట మహేష్ ని ఎమ్మెల్యేగా చేయడమే మా లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొర్ర గంజి రమణ, పోతిన వెంకటేష్, మరి పిళ్ళ రాజు, దుక్క సాంబ, మురళి, పిళ్ళ వంశీ, తమ్మిన రఘు, గుడెల దుర్గారావు, పోతిన …

Read More »

ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న : రాజుబాబు

-రెండు గిరిజన తండాలకు సహాయం అందించిన బీటింగ్ హార్ట్స్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని పేద ప్రజల అవసరాలను గుర్తించి వారికి చేదోడుగా నిలిచేందుకు బీటింగ్ హార్ట్స్ ముందుకు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు అన్నారు. సమాజానికి మన వంతుగా తోచిన రీతిలో సహాయం అందించాలన్నారు. ఆదివారం  19వ అంతర్జాతీయ జావా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర జావా ఏజిడి మోటార్ సైకిల్స్ క్లబ్ అధ్యక్షుడు ముఖర్జీదండే ఆధ్వర్యంలో బందరు రోడ్డు లోని రవాణాశాఖ …

Read More »

విజయవాడ స్టేషన్‌ యార్డులో భారీ ఎత్తున మార్పులను చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ స్టేషన్‌ యార్డులో భారీ ఎత్తున మార్పులను చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే. ఈ మార్పుచేర్పులతో రైళ్ల నిరీక్షణ సమయం తగ్గుతుంది మరియు సెక్షనల్‌ సామర్థ్యం మెరుగవుతుంది. దీంతో ప్రధానంగా సికింద్రాబాద్‌`విశాఖపట్నం మధ్య ఏకకాలంలో రైళ్ల రాపోకలకు సౌలభ్యం ఏర్పడుతుంది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ స్టేషన్‌ యార్డులో ఇంటర్‌లాకింగ్‌ సిస్టంతో సహా పెద్ద ఎత్తున యార్డులో మార్పుచేర్పులను చేపట్టింది. దీంతో రైళ్ల రాకపోకలలో ముఖ్యంగా సికింద్రాబాద్‌`విశాఖపట్నం మధ్య రైళ్ల నిర్వహణలో మెరుగైన సౌలభ్యం ఏర్పడుతుంది. భారతీయ …

Read More »

వాతావరణ సూచన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర ఆంధ్ర ప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధముగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియరిక్ స్థాయిల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. పశ్చిమ రాజస్థాన్ మధ్య ప్రాంతాల నుండి తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా మరియు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ల మీదుగా …

Read More »

కిడ్నీ రీసర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం కావాలి…

-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్దాన ప్రాంత కిడ్నీ రోగులకు పూర్తి స్థాయి చికిత్స అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కార్ ను కోరారు. ఆదివారం జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి డాక్టర్ అప్పలరాజు ఉద్దానం రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి …

Read More »

పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మమ్మల్ని అడ్డుకోవడం దారుణం…

-ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని ప్రాజెక్ట్‌ సందర్శనకు వెళ్లిన మమ్మల్ని అడ్డుకోవడం దారుణమని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును తెలంగాణ సరిహద్దు వద్ద తెలంగాణ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న ప్రదేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా …

Read More »

సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తోంది … : కేశినేని నాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆస్తి పన్ను విధానంతో పూరి గుడిసె ఉన్నవారు కూడా ఆస్తి పన్ను కట్టలేక ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో ఆదివారం 19వ డివిజన్‌ టీడీపీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు పెంచుతోందని కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలోనే చెప్పామని, ప్రజలు …

Read More »