విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు ని గులాబీతోట రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసారు. రోడ్డు వైడనింగ్ పనులు చేపట్టాలని, పార్క్ లో మహిళల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయటంతో పాటు పలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు, స్థానిక కార్పొరేటర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని మల్లాది విష్ణు హామీ ఇవ్వటంతో రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ని కలిసిన వారిలో రాము, అనిల్, శ్రీనివాస్ తదితరులున్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …