విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు కలిసారు. పౌరోహిత్యాన్ని కుల వృత్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని, తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతిపత్రం అందజేసారు. కులవృత్తిగా గుర్తించడం ద్వారా తమకు భద్రత, భరోసా లభిస్తుందని, అన్ని సంక్షేమ పథకాలకి అర్హులు అవుతామని సమాఖ్య సభ్యులు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పటంతో ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో యామజాల నరసింహమూర్తి, విధ్యాదర శాస్త్రి, సునీల్ శర్మ తదితరులున్నారు.
Tags vijayawada
Check Also
కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల వరద సాయాన్ని త్వరగా అందించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …