Breaking News

ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న : రాజుబాబు


-రెండు గిరిజన తండాలకు సహాయం అందించిన బీటింగ్ హార్ట్స్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని పేద ప్రజల అవసరాలను గుర్తించి వారికి చేదోడుగా నిలిచేందుకు బీటింగ్ హార్ట్స్ ముందుకు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు అన్నారు. సమాజానికి మన వంతుగా తోచిన రీతిలో సహాయం అందించాలన్నారు. ఆదివారం  19వ అంతర్జాతీయ జావా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర జావా ఏజిడి మోటార్ సైకిల్స్ క్లబ్ అధ్యక్షుడు ముఖర్జీదండే ఆధ్వర్యంలో బందరు రోడ్డు లోని రవాణాశాఖ ఉద్యోగుల భవనం సమీపంలో నిర్వహించిన జావా ఏజిడి మోటార్ సైకిల్లా ప్రదర్శన కార్యక్రమానికి రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. జావా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా గిరిజన ప్రాంతంలోని రెండు తండా గ్రామాల ప్రజలకు నిత్యం ఉపయోగించే వస్తు సామగ్రిని ఉచితంగా అందించే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ నిరక్షరాస్యులే గిరిజన ప్రాంతాలలోని ప్రజలు ఎవరి నుండి ఏమి ఆశించరని, అయితే వారి అవసరాలను గుర్తించి స్పందించే హృదయంతో ఆంధ్ర జావా ఎజిడి మోటార్ సైకిల్ క్లబ్ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన వేనం, రోలుగుంట గ్రామాలలో నేటి ఆధునిక సమాజానికి దూరంగా నిర్మలమైన మనస్సుతో జీవించే గిరిజనుల అవసరాలను గుర్తించి వారికి చేదోడుగా నిలవడం అభినందనీయమన్నారు. ఆంధ్ర జావా / ఏజిడి మోటార్ సైకిల్ క్లబ్ లోని సభ్యులు విరాళంగా లక్ష రూపాయలను పోగుచేసుకొని గిరిజన ప్రాంతంలోని దండా ప్రజలకు వస్తు సామగ్రి రూపంలో బకెట్లు, దుప్పట్లు, సబ్బులు, షర్ప్, డేటాల్, పుస్తకాలు, పెన్నులు, బట్టలు, మందులు మొదలగు వాటిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అంతర్జాతీయ జావా దినోత్సవం సందర్భంగా తండా ప్రజలకు కొనుగోలు చేసిన వస్తువులను పంపించడం వారి సేవ భావానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఎన్నో క్లబ్ లు ఉన్నప్పటికీ కేవలం వార్షికోత్సవం వారి బృందాలకి మాత్రమే పరిమితం అవుతాయని, కానీ జావా క్లబ్ సభ్యులు సమాజసేవలో భాగస్వామి అవ్వడం ఎంతో స్ఫూర్తిదాయకమని రాజుబాబు అన్నారు.

క్లబ్ అధ్యక్షుడు ముఖర్జీదండే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జావా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం పేద ప్రజల అవసరాలను గుర్తించి సహాయం చేయడం వంటి సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలను క్లబ్ సభ్యుల కృషితోనే కలిసికట్టుగా చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే మా క్లబ్ సభ్యులు విశాఖ జిల్లా గిరిజన తండాలలో పర్యటించారన్నారు. ఆధునిక సమాజానికి దూరంగా జీవిస్తున్న రెండు తండాల ప్రజలను గుర్తించి అక్కడ ప్రజలకు కావలసిన వస్తు సామాగ్రి అవసరాలను తెలుసుకున్నట్లు తెలిపారు. తాము సేకరించుకున్న లక్ష రూపాయలతో ఆ వస్తువుల ను కొనుగోలు చేసి పంపించడం జరిగిందన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలలో భాగస్వాములం కావడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా 19వ జావా అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకుని జావా / హెచ్డీ మోటార్ సైకిళ్లలను ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఎం శ్రీనివాస్, ఎ బోస్, కె.ఆర్ రామచంద్రరాజు,లాతిబ్, కె కిషోర్, ఆర్టీఓ అధికారి అబ్దుల్ సత్తార్, టూవీలర్ మెకానికల్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *