Breaking News

Latest News

గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్ర భవనాల ను ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు…

కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుకు కావలసిన అన్ని అవసరాలు గ్రామంలోనే తీర్చే ఉద్దేశ్యంతో గ్రామ గ్రామాన రైతు భరోసాకేంద్రాలు నిర్మించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. కలిదిండి మండలం మట్టగుంటలో లో డా వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని జరుపుకున్న రైతు దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్ర భవనాల ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ …

Read More »

ఆక్వారంగంలో ఆగ్రగామిగా కైకలూరు ప్రాంతం…

-ఆక్వాల్యాబ్ ను ప్రారంభించిన శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వారంగంలో అగ్రగామిగా ఉన్న కైకలూరు లో ఆక్వారైతులకు ప్రభుత్వ అధికారుల సహకారం మరింత అవసరమని .అధికారులు రైతులకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండి సహకరించాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. గురువారం డా.వై.ఎస్.ఆర్ జయంతిని పురస్కరించుకుని రైతు దినోత్సవం సందర్భంగా కైకలూరు లో ఆధునిక హంగులను సంతరించుకున్న ఆక్వా ల్యాబ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లోనే ఆక్వారంగంలో కైకలూరు ప్రాంతం అగ్రగామిగా ఉందని …

Read More »

చంద్రాల నుంచి గుడ్లవల్లేరు వరకు రూ. 4.37 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం…

-రూ.21.80 లక్షలతో ఆర్బీకే, రూ.10 లక్షలతో నిర్మించిన అంగన్ వాడీ కేంధ్రాలకు  ప్రారంభం…  -రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశశిభూషణ్ గుడ్లవల్లేరు, చంద్రాల, నేటి పత్రిక ప్రజావార్త : రైతు ఆర్థికాభివృద్దే ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆర్బీకేలను ఏర్పాటు చేసి రైతు సమస్యలను వారి గ్రామాల్లోనే పరిష్కరించే విదంగా చర్యలు చేపట్టారని రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. గురువారం గుడ్లవల్లేరు మండలం చంద్రాల నుంచి గుడ్లవల్లేరు వరకు రూ. 4.37 లక్షలతో నిర్మించనున్న 6.8 కీ.మీ.నిడివిగల బీటీ రోడ్ …

Read More »

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్‌ దంపతులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఆయన కుటుంబసభ్యులు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్‌ 72వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంజలి ఘటించి నివాళులు అర్పించారు. సీఎం జగన్‌ తన సతీమణి వైఎస్‌ భారతతితో కలిసి వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలోని మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు సీఎం …

Read More »

పులివెందులలో స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి శంకుస్థాపన…

-రూ.30 కోట్లతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన స్కిల్ ట్రైనింగ్ అకాడమీ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో త్వరలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 25 స్కిల్ కాలేజీలు -యువతలో నైపుణ్యాలు పెంచడంతోపాటు ఉద్యోగాలు పొందేలా శిక్షణ : సీఎం జగన్ పులివెందుల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని యువతకు మంచి ఉద్యోగాలు రావడం కోసం అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం పులివెందులసహా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు …

Read More »

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం… : ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహనేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి  పుట్టిన రోజు ను రైతు దినోత్సవం గా జరుపుకోవడం సంతోషకరమని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ అవరణలో రూ 65 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వై యస్ ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను గురువారం అధికారులు రైతులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ప్రారంభించారు. అనంతరం రైతులకు సబ్సిడీ పై మంజూరైన వ్వవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా …

Read More »

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకే అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లు..

-గుడివాడ నియోజవర్గంలో 97 లక్షలతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించిన .. -రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు అగ్రి టెస్టింగ్ ల్యాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసారని రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ. 97 లక్షల రూపాయల తో నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ఆయన మార్కెట్ యార్డు చైర్ పరస్ …

Read More »

మనది రైతు పక్షపాత ప్రభుత్వం…

-రాయదుర్గం సభలో సీఎం వైఎస్ జగన్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలను మార్చిన ఘనత వైఎస్‌ఆర్‌ది అని సీఎం జగన్‌ గుర్తుచేశారు. మనది రైతుపక్షపాత ప్రభుత్వమని, రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్‌ …

Read More »

మంత్రి కొడాలి నాని తో కలిసి కొండాలమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తున్న జాయింట్ కలెక్టరు మాధవీలత…

-జాయింట్ మాధవీలతకు శ్రీ కొండాలమ్మ వారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న ఆలయ ఈవో… గుడ్లవల్లేరు(వేమవరం), నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానాన్ని జాయింట్ కలెక్టరు( రెవెన్యూ) కె. మాధవీలత తో కలిసి రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) గురువార సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ కొండాలమ్మ అమ్మవారికి మంత్రి …

Read More »

రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రతినియోజకవర్గంలో డాక్టర్ వైస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు…

-రైతులకు అందుబాటులే ఆర్బీకే కేంద్రాలు.. గ్రామ సచివాలయాలు. -విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు నాణ్యత నిర్ధారణ కొరకు అగ్రి ల్యాబ్ల్ లు -రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) గుడ్లవల్లేరు (వడ్లమన్నాడ), నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు,పురుగుమందుల బారిన పడి నష్టపోకుండా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. గురువారం గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడ …

Read More »