Breaking News

Monthly Archives: November 2024

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాలతో 49వ డివిజన్ వీరయ్య వీధి కొండ ప్రాంతంలో మొదటి విడతగా రూ 34 లక్షల వ్యయంతో రిటైనింగ్ వాల్ ,(రక్షణ గోడ) నిర్మిస్తున్నామని బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తెలిపారు. వీరయ్య వీధిలో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను కూటమి నేతలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరయ్య వీధి కొండ ప్రాంతవాసులు ఇకపై ఆందోళన చెందనవసరంలేదన్నారు. వర్షానికి మట్టి నాని …

Read More »

ఈనెల 11 వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం ఈనెల 11 వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం రోజున A- Convention Center Vijayawada లో జరుగుతుంది . దీనిలో పాఠశాల విద్య , ఇంటర్మీడియట్ విద్య, పాలిటెక్నిక్ కాలేజీ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీ విద్య , ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కాలేజీ లలో ఉత్తమ ప్రతిభా కనపరచిన ఉత్తమ ఉపాధ్యాయులకు విద్యాశాఖామంత్రి నారా లోకేష్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డ్స్ అందజేయడం జరుగుతుందని …

Read More »

బాల్య వివాహాలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు

– బాల్య వివాహం నుంచి 15 ఏళ్ల అమ్మాయిని కాపాడిన ఐసీడీఎస్ సిబ్బంది – జిల్లా మ‌హిళా, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎవ‌రైనా బాల్య వివాహాలు చేస్తే చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఎన్‌టీఆర్ జిల్లా మ‌హిళా, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి.హెచ్చ‌రించారు. బాల్య వివాహాల నిరోధానికి క్షేత్ర‌స్థాయిలో వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్నార‌ని.. విజ‌య‌వాడ రూర‌ల్‌, అంబాపురానికి చెందిన 15 ఏళ్ల ఓ అమ్మాయిని క‌డ‌ప జిల్లాకు చెందిన 34 …

Read More »

భవానీ ద్వీపాన్ని సందర్శించిన భవాని ద్వీప పర్యాటకాభివృద్ధి సంస్థ (BITC) ఇంచార్జి ముఖ్య కార్యనిర్వహణాధికారి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన భవాని ద్వీపాన్ని ఈరోజు ఇటీవల కొత్తగా BITC ఇంచార్జి సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన వి. స్వామి నాయుడు సందర్శించారు. ఇటీవలి వరదల వల్ల సంభవించిన నష్టాన్ని సమీక్షించి , పునరుద్ధరణ కార్యక్రమాల పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో సోమవారం నుండి అడ్వెంచరస్ గేమ్స్ (సాహస క్రీడలు) ని పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను …

Read More »

గ్యాస్ డెలివరీ బాయ్స్ చే ఈ కేవైసీ నమోదు చేసుకునే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ఉచిత గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు వారి ఇంటి వద్దే గ్యాస్ డెలివరీ బాయ్స్ చే ఈ కేవైసీ నమోదు చేసుకునే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సంవత్సరానికి [3] గ్యాస్ సిలిండర్లు ఉచితముగా పంపిణీ చేసే పథకాన్ని అక్టోబర్ 31నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని 55 గ్యాస్ ఏజెన్సీ లలో ఉచిత సిలిండర్ల బుకింగ్ …

Read More »

బీసీ స్ట‌డీ స‌ర్కిల్‌లో డీఎస్‌సీ ఎస్‌జీటీ ఉచిత శిక్ష‌ణ‌

– ఈ నెల 12లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. – బీసీ స్ట‌డీ స‌ర్కిల్ డైరెక్ట‌ర్ కె.శ్రీనివాస‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్‌సీ-ఎస్‌జీటీ ప‌రీక్ష‌కు బీసీ స్ట‌డీ స‌ర్కిల్ ద్వారా అందించే ఉచిత శిక్ష‌ణ‌కు అర్హులైన అభ్య‌ర్థులు ఈ నెల 12వ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఎన్‌టీఆర్ జిల్లా ఏపీ బీసీ స్ట‌డీ స‌ర్కిల్ డైరెక్ట‌ర్ కె.శ్రీనివాస‌రావు శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ అభ్య‌ర్థులు బీసీ స్ట‌డీ స‌ర్కిల్ ద్వారా పొందిన ద‌ర‌ఖాస్తుకు …

Read More »

విద్యార్థి మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చెరువులో ఈతకు వెళ్లి ఊపిరాడక బాపట్ల జిల్లా దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహం ఎనిమిదో తరగతి విద్యార్థి వరుణ్ తేజ్ దుర్మరణపాలయ్యాడు. విద్యార్థి మృతిపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహం ఎనిమిదో విద్యార్థి వరుణ్ తేజ్ హాస్టల్ పక్కనున్న జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడన్నారు.. శుక్రవారం సాయంత్రం పాఠశాల …

Read More »

ప్రజలకు న్యాయ సేవా హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 9వ తేదీన జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణం నుండి జిల్లా కోర్ట్ సెంటర్ వరకు ప్రజలకు న్యాయ సేవా హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించి జిల్లా కోర్టు సెంటర్ లో మానవహారం నిర్వహించారు. కోర్టు సిబ్బంది తొలిత జెండా ఊపి ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, పారా లీగల్ …

Read More »

పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలనే ప్రభుత్వ ఆశయం అవగాహన కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటికొకరు పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలనే ప్రభుత్వ ఆశయం అనుసరించి ఈనెల 9వ తేదీన శనివారం ఉదయం10.00 గం.లకు మచిలీపట్నం లోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలు నందు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర సారథ్యం లో ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. 18 ఏళ్లు నిండి స్వంతంగా ఏదేని పరిశ్రమ స్థాపించాలి అనే వారికి పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలి, పరిశ్రమ ఎలా స్థాపించాలి దానికి కావలసిన అర్హతలు …

Read More »

స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతిభావంతులైన ఎస్.సి/ ఎస్.టి విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ శిక్షణ కొరకు ఈ నెల అనగా ది.10.11.2024 తేదిన జరుగు స్క్రీనింగ్ టెస్ట్ ను “MLC ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్” అమలులో ఉన్నందున ప్రస్తుతానికి వాయిదా వేయుట జరిగినది. తదుపరి జరుగు డీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా తేదిని అభ్యర్థులకు తరువాత తెలియపరచుట జరుగును అని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి అయిన షాహిద్ బాబు షేక్ …

Read More »