విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మలగన్న అమ్మ అశీస్సులు తోడై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధించాలని, అన్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. శక్తిస్వరూపిణి, సర్వలోకాలకు ఆదిదేవత అయిన దుర్గామాతను శరణు వేడుతూ ఆదివారం బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి తో కలసి అమ్మకు ప్రత్యేక విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద రామకృష్ణ మాట్లాడుతూ… కష్టకాలంలో అమ్మను శరణు వేడితే, అన్నింటికీ పరిష్కారాలు …
Read More »Monthly Archives: December 2024
సభ్యత్వ నమోదులో గిన్నిస్ రికార్డు సృష్టించనున్న తెలుగుదేశం
–టీడీపీలో ఎంపీ, ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేసే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. –11వ డివిజన్‌లో టీడీపీ సభ్యత్వ కార్డులను అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య యుతంగా సభ్యత్వ నమోదు నిర్వహించడమే కాకుండా కోటి మందికి సభ్యత్వాలు ఇచ్చి త్వరలో తెలుగుదేశం పార్టీ గిన్నిస్ రికార్డులో పేరు నమోదు చేసుకోబోతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించే తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఉంటూ ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజా సేవ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు సంక్షేమ పథకాలు అందజేస్తాం
-9వ డివిజన్ పర్యటన లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయడం తోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ అన్నారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లో మసీద్ రోడ్డు కాలవ గట్టు చివరి ఏరియా లో 9వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. …
Read More »ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కుటంబంలో ఒక ఎంటర్ ప్రెన్యూర్ ను తయారు చేయటమే ఎంపి కేశినేని శివనాథ్ లక్ష్యం
-టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం -హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో స్వయం ఉపాధిపై అవగాహన కార్యక్రమం -మెదట విడతలో వెళ్లనున్న50 మందికి పైగా నిరుద్యోగులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిని ఎంటర్ ప్రెన్యూర్ గా తయారు చేసే దిశగా ఎంపి కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో నిరుద్యోగ యువత …
Read More »కళా ఉత్సవ్ 2024-25 రాష్ట్ర స్థాయి పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోని విద్యార్థుల సృజనాత్మకతను మరియు కళాత్మక ప్రతిభను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన “కళా ఉత్సవ్” ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీలు 2024 డిసెంబర్ 9 మరియు 10 తేదీల్లో విజయవాడలోని పొరంకి నిడమానూరు రోడ్డు లోని వద్ద ఉన్న మురళీ రిసార్ట్స్ ప్రాంగణంలో జరగనున్నాయని డైరెక్టర్, పాఠశాల విద్య వి. విజయ్ రామరాజు తెలియచేశారు. సమగ్ర శిక్షా మరియు రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ (SCERT) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం లో జిల్లా స్థాయి …
Read More »ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల పై నిర్మాణాలు చేయకుండా, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని, నిబందనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. ఆదివారం కమిషనర్ గారు గోరంట్ల, రెడ్డిపాలెం ప్రాంతాల్లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, సెట్ బ్యాక్, …
Read More »సోమవారం జిఎంసి డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..
-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, …
Read More »కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ రోజు – భక్తి సంగీతం మరియు సంప్రదాయ వారసత్వానికి మహోత్సవం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ రోజు వేడుకలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తి భావంతో ప్రారంభమయ్యాయి. స్థానిక కళాకారులు మరియు గాయకులు దేవీ కృతులు ఆలపించి, భక్తి మరియు సంగీతం కలిసి మేళవించిన అద్భుత ప్రదర్శన అందించారు. కళాకారులను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామీ వారల దేవస్థాన అధికారులు మరియు ప్రధాన అర్చకులు సన్మానించి, ఈ మహా సంగీత ఉత్సవానికి అందించిన వారి విశేష సేవలను గుర్తించారు. ఈ మహోత్సవం నేడు సాయంత్రం …
Read More »ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోండి కలెక్టర్లకు సియం ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు,సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు.ధాన్యపు రాశులను వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ఎక్కడైనా రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రాసులుగా వేసి ఉంటే ఆధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్ఫాలిన్లను రైతులకు సమకూర్చాలని సియం జిల్లా …
Read More »ఈ నెల 9వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …
Read More »