Breaking News

Monthly Archives: December 2024

11, 12వ తేదీల్లో కలెక్టర్ల సమావేశం

-ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో కలెక్టర్ల సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధ, గురువారాల్లో ఈ సదస్సు జరగనుంది. ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు, వంటి అంశాలపై సీఎం దిశానిర్ధేశం చేయనున్నారు. రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 26 …

Read More »

మైనారిటీల బడ్జెట్ ను ఇతర పథకాలకై దారిమళ్లించ కూడదు

-జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షాహెజాది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మైనారిటీల బడ్జెట్ ను మైనారిటీల సంక్షేమానికే వినియోగించాలని, ఇతర పథకాల అమలుకై ఆ నిధులను దారి మళ్లించ కూడదని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు శ్రీమతి సయ్యద్ షాహెజాది అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రధాన మంత్రి కొత్త 15 పాయింట్ల కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం ఆమె అద్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మైనారిటీల …

Read More »

ఈనెల 17న రాష్ట్రపతి పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు చేయండి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 17వతేదీన మంగళగిరి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)ప్రధమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపధ్యంలో అందుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ దేశ ప్రధమ పౌరురాలైన రాష్ట్రపతి రాష్ట్ర పర్యటన విజయవంతం చేసేందుకు ప్రోటోకాల్ …

Read More »

వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2025 అక్టోబర్ 2 నాటికి వ్యర్ధాలను సమర్దవంతంగా నిర్వహణ చేయడం ద్వారా డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో కృషి చేస్తామని, త్వరలో కాకినాడ, నెల్లూరుల్లో, కడప, కర్నూల్, అనంతరపురం దగ్గర వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మంగళవారం స్వచ్చాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, …

Read More »

మూడు రాజ్యసభ ఎంపి సీట్లకు ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్ధులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బిజెపి తరుపువ ఆర్.కృష్ణయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి వద్ద రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా వారు నామినేషన్లను దాఖలు చేశారు. మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్ధులే నామినేషన్ల దాఖలు చేయడంతో నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణల గడువు …

Read More »

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తారా పేటలోని ఆయన కార్యాలయంలో జరిగిన వేడుకలలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి శుభాకాంక్షలు తెలిపి దుశ్మాలువ తో సన్మానించారు. జలీల్ ఖాన్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో టిడిపి నాయకులు కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

Read More »

విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు..

-విశాఖలోని ఓ స్కానింగ్ సెంటర్లో మహిళను సిబ్బంది వేధింపులకు గురిచేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. -మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.. -నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సెంట్రల్ జైలుకు తరలింపు.. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం నగరంలోని ఓ హాస్పిటల్ లో స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకు గాయం తగిలిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. …

Read More »

లింగ ఆధారిత హింసను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి

-రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యదర్శి విద్యాపురపు వసంత బాల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేడు ప్రతి ఇంట్లోను మహిళలు లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యదర్శి వి. వసంత బాల తెలిపారు. విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజ్ ఆడిటోరియం హాల్‌లో లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆదేశాలకు అనుగుణంగా జాతీయ మహిళా కమిషన్ (NCW) న్యూఢిల్లీ సహకారంతో రాష్ట్ర మహిళా కమిషన్‌ మధ్యాహ్నం సదస్సును నిర్వహించడం …

Read More »

త్వరలో క్రిస్మస్ కానుక అందిస్తాం

-అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని పునరుద్ధరిస్తాం -గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తాం -రాష్ట్రంలో రూ. 340 కోట్లతో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తాం -రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిపేసిన కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ పూర్తి చేస్తాం -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందిస్తామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ …

Read More »

రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి 15 పాయింట్ల కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ మైనారిటీ కమిషన్ మెంబర్ మిస్ సయ్యద్ షహజాది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి 15 పాయింట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులు మరియు మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు లను రాష్ట్రంలో మైనారిటీలకు జరుగుతున్న సహాయ కార్యక్రమాలు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందుతున్న పథకాల గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మైనారిటీలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న హాస్టల్స్ ను , PMJVK …

Read More »