అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు,సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు.ధాన్యపు రాశులను వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ఎక్కడైనా రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రాసులుగా వేసి ఉంటే ఆధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్ఫాలిన్లను రైతులకు సమకూర్చాలని సియం జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. వర్షాలు పడే సమయంలో రైతులెవరూ పంట కోత చేయకుండా వ్యవసాయ శాఖ సూచనలనురైతులందరూ పాటించే విధంగా చుడాలని కలెక్టర్లను సియం ఆదేశించారు.
Tags amaravathi
Check Also
తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్
-క్షేత్రస్థాయి ఆర్ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …
Prajavartha Online Telugu News