Breaking News

Daily Archives: January 17, 2025

అర్జీదారులకు ఆపన్న హస్తం అందించి మరోసారి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

-ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 11 మందికి సుమారు రూ. 34.50 లక్షల ఆర్థిక సాయం చెక్కులను పలువురు అర్జీదారులకు అంచచేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎంఎల్ఏ పులివార్తి నాని -ఆపన్న హస్తం అందించి తమను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుతూ చల్లగా ఉండాలని మనసారా దీవించిన పలువురు అర్జీదారులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రగిరి మండలం నారావారిపల్లెకి తన స్వంత గ్రామానికి సంక్రాంతికి విచ్చేసిన సమయంలో తనను కలిసిన …

Read More »

స్వచ్ఛత దివస్ లో అందరూ పాల్గొనండి

-నగర పౌరులను పిలుపునిచ్చిన ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతినెల మూడవ శనివారం స్వచ్ఛత దివస్ నిర్వహించి నగరాన్ని మరింత స్వచ్ఛత వైపు అడుగులు వేయాలనే శుభసంకల్పంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష సూచనల మేరకు విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ శనివారం ఉదయం 9 గంటలకు ధర్నా చౌక్ లో గల స్వచ్ఛత దివస్ …

Read More »

ఘనంగా ఆచార్య యార్లగడ్డ విరచిత “సమరశీల ధీర వనిత కమలా హారిస్“ పుస్తకావిష్కరణ

-త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా నేడు లోక్ నాయక్ పురస్కారాలు విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు, పద్మ భూషణ్ , ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విరచిత సమరశీల ధీర వనిత కమలా హారిస్ పుస్తకాన్ని విశాఖపట్నం లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాజీ మేయర్ రాజన రమణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ మహిళలు సమాజ పురోగతికి నిత్య నూతనంగా మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. “మహిళలు సమాజ పురోగతికి మూలస్తంభాలు. వారి శాంతియుత …

Read More »

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంక్వయిరీ అథారిటీగా ఆర్పీ సిసోడియా

అమరావ‌తి,  నేటి పత్రిక ప్రజావార్త : సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు అథారిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ అథారిటీ కి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేతృత్వం వహించనుండగా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాను ప్రెజెంటింగ్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్‌పై ఉన్న అభియోగాలపై నివేదిక ఇవ్వాలని అధారిటీని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ …

Read More »

నూతన సంవత్సరం డైరీ ను విడుదల చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి సీనియర్ నాయకులు రెడ్డిపల్లి రాజు ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ని శుక్రవారం తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుజనా చౌదరి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ ఎన్డీయే కూటమి నేతలు కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని సుజనా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎన్డీయే కూటమి నేతలు మైలవరపు …

Read More »

సంధార్ సాథి పోర్టల్ ఆవిష్కరణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర కమ్యూనికేషన్లు & ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా, శుక్రవారం న్యూఢిల్లీలోని చాణక్యపురిలోని హోటల్ అశోక్ ఈ క్రింది పౌర-కేంద్రీకృత కార్యక్రమాలు మరియు యాప్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జె వి రాజా రెడ్డి, అదనపు డీజీటీ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రంలో టెలికమ్యూనికేషన్ శాఖ ఇటీవల చేపట్టిన కార్యక్రమాల గురించి మరియు నేడు ప్రారంభించిన కార్యక్రమాలను మీడియాకు వివరించారు. సంచార్ సాథ్ మొబైల్ యాప్ సమగ్ర పౌర-కేంద్రీకృత పోర్టల్ అయిన …

Read More »

ప్రమాదాల నివారణకు పజల భాగస్వామ్యం అవసరం

-రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయండి.. -ఉప రవాణా అధికారి ఎ. మోహన్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, రహదారి భద్రతా మాసోత్సవాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసి రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉప రవాణాశాఖ అధికారి ఎ. మోహన్‌ తెలిపారు. జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో పిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణ పై రవాణా శాఖ ఉప రవాణా …

Read More »

సంపద సృష్టించి అభివృద్ధి చేసే సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఉంది

-విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నిధులు కేటాయింపుపై హర్షం -నియోజకవర్గంలో ఏడుగురికి ఇస్త్రీ పెట్టెలను అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రజల కోరికలు, అవసరాలు తెల్సుకుని వాటిని సమకూర్చుకునేందుకు సంపదను సృష్టించి అభివృద్థి చేసే సత్తా ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. శుక్రవారం ఉదయం అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో ఏడుగురు రజక సోదరులకు జీవనోపాధి నిమిత్తం ఇస్త్రీపెట్టెలను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తన సొంత నిధులు …

Read More »

రిటైనింగ్‌ వాల్‌ పక్కన రోడ్డు నిర్మాణం

-రోడ్డుతో పాటు డ్రైనేజీ, పంపింగ్‌ స్టేషన్ల నిర్మాణానికి చర్యలు -కార్పోరేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, కన్సల్‌టెంట్స్‌తో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ సమావేశం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా రిటైనింగ్‌ వాల్‌ పక్కన రోడ్డుతో పాటుగా డ్రైనేజీ, పంపింగ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసి అక్కడి నివాసులకు ఏవిధమైన ఇబ్బంది లేకుండా జీవనం సాగించేలా చూడాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ కార్పోరేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో నియోజకవర్గంలోని …

Read More »

స్వఛ్చత కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి మూడో శనివారం స్వఛ్చ ఆంధ్ర – స్వఛ్చ దివాస్ లో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రవేటు సంస్థలలో స్వఛ్చత కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు పకడ్బందీ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ స్వఛ్చ ఆంధ్ర – స్వఛ్చ దివాస్ కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక …

Read More »