అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజనపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు.ప్రధాన మంత్రి సూర్యఘర్ ముప్త్ బిజిలీ యోజన మరియు ప్రధానమంత్రి-కుసుమ్ పధకాలకు సంబంధించి బుధవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన ప్రధమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి స్వంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు …
Read More »Daily Archives: January 22, 2025
మహాబోధి ఆలయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆధ్యాత్మిక పర్యటన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి మరియు ఉప స్పీకర్ కె. రఘు రామ కృష్ణ రాజు, వారి సతీమణి బీహార్ రాష్ట్రంలోని ప్రసిద్ధ బోధ్ గయా ప్రాంతాన్ని సందర్శించారు. ప్రపంచప్రసిద్ధ మహాబోధి ఆలయం ప్రాంగణంలో పర్యటించి, దైవిక ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. మహాబోధి ఆలయం బుద్ధిజం చరిత్రలో అత్యంత ప్రధానమైన ప్రదేశంగా భావించబడుతుంది. ఈ ప్రాంతంలోనే భగవంతుడు బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానం చేసి జ్ఞానోదయం పొందారు. ఈ వృక్షం బుద్ధిజం ఉద్భవానికి చిహ్నంగా నిలుస్తోంది. …
Read More »పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎస్.సురేశ్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్.సురేశ్ కుమార్ బుధవారం రాష్ట్ర సచివాలయం రెండవ భవనంలో బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా ఐఅండ్ఐ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సురేశ్ కుమార్ ను పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఈమేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ సురేశ్ కుమార్ ను పురపాలక …
Read More »జిఏడి ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ముకేశ్ కుమార్ మీనా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్),జిఏడి సేవలు ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా బుధవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన నేపధ్యంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనాను జిఏడి ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆయన ఈమేరకు బాధ్యతలు స్వీకరించారు.ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యం..
– ప్రతి గ్రామంలో మోడల్ ప్రైమరీ పాఠశాల, ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి….. – రాష్ట్ర విద్యాశాఖ ప్రాంతీయ సదస్సులో డైరెక్టర్ వి.విజయరామరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేసే లక్ష్యంగా విద్యాశాఖ ముందుకెళ్తోందని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు అన్నారు. స్థానిక మేరీస్ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని మానవ వనరుల అధికారులు, ప్రధానోపాధ్యాయులతో నూతన విద్యా విధానంపై ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ప్రాంతీయ సదస్సులో డైరెక్టర్ విజయ …
Read More »ఈ నెల 23న సూర్యఘర్ ప్రత్యేక అవగాహన ర్యాలీలు
– గ్రామ, వార్డు సచివాలయం వారీగా నిర్వహణకు ఏర్పాట్లు చేయండి – విస్తృత జనజాగృతి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుటుంబాలకు ఆర్థిక చేయూతకు, పర్యావరణ పరిరక్షణకు మేలుచేసే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఈ నెల 23వ తేదీన ప్రత్యేక ర్యాలీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పీఎం సూర్యఘర్‌పై కలెక్టర్ లక్ష్మీశ.. …
Read More »అనధికార డంపింగ్ ప్రాంతాలపై పూర్తి పర్యవేక్షణ పెట్టండి…
-అనుమతి లేకుండా వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకోండి… -ప్రజల ఆరోగ్యమే ముఖ్యం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి… -గార్భేజ్ వనరబుల్ పాయింట్స్ లను తక్షణమే తొలగించండి… -జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బహిరంగ ప్రదేశాలు మరియు రోడ్ల వెంట వ్యర్ధ పద్దార్థాలను వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న గార్భేజ్ వనరబుల్ పాయింట్స్‌ను తక్షణమే తొలగించి ఆయా ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేసి వ్యర్థాలను పడవేసే వారిని గుర్తించి జరిమానాలను విధించేందుకు వెనకాడవద్దని జిల్లా …
Read More »దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రం నుండి ధరఖాస్తులకు ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా, బాదంపూడి లో గల దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రం బాదంపూడి నందు 135వ బృందములో శిక్షణ పొందుటకు అభ్యర్ధులు 19 ఫిబ్రవరి, 2025 వ తేదీలోగా వారి దరఖాస్తులను మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి, ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లాకు పంపాల్సిందిగా ఏలూరు జిల్లా మత్స్యశాఖ అధికారి కే.ఎస్.వి.నాగలింగచార్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.. 5వ తరగతి ఆ పైన చదువుకున్న వారికి ప్రాదాన్యత, తెలుగులో చదవడం, రాయడం తెలిసిన వారికి అవకాశం …
Read More »జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్ట్ లకు మార్చి 2న వ్రాత పరీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జైళ్ల శాఖ డ్రైవర్ పోస్ట్ లకు మార్చి 2న వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నామని జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జైళ్ల శాఖలో 5 డ్రైవర్ పోస్ట్ లకు గాను గతంలో నిర్వహించిన డ్రైవింగ్ టెస్ట్ లో పాల్గొని అర్హత సాధించిన 311 మందికి ఈ ఏడాది మార్చి 2న వ్రాత పరీక్షను నెల్లూరు జిల్లా మూలపేట లోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమి ఫర్ రిఫార్మేషన్ సర్వీసెస్(APSTARS), పాత సెంట్రల్ …
Read More »స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద ఏపీలో స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్ టైల్ డిజైనర్స్ గా పనిచేయుటకు ఆసక్తి గత అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చేనేత మరియు జౌళీ శాఖ కమిషనర్ జి. రేఖారాణి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. అభ్యర్థులను అర్హత, అనుభవం, వయస్సు, నివాసం తదితర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్ టైల్ డిజైనర్స్ …
Read More »