Breaking News

నెరవేరిన ముఖ్యమంత్రి హామీ

-పారిశుద్య కార్మికులకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందించిన జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి

కడప, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుద్య కార్మికుల కృషిని గౌరవిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ముగ్గురు పారిశుద్య కార్మికులకు నగదు బహుమతిని బుధవారం తన ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ… మైదుకూరు మున్సిపాలిటికి చెందిన పారి శుద్య కార్మికులు పి.అమ్ములమ్మ, జి. చెన్నమ్మ, యం.గంగాధర్..లు విలువలు పాటిస్తూ విధులపట్ల అంకిత భావంతో సమాజ శ్రేయస్సుకు ఎంతో విలువైన సేవలందిస్తున్నారన్నారు. ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకే విధులకు హాజరై మైదుకూరు రోడ్లు, టౌన్, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం జరుగుతోంది. వీరి కృషి, పట్టుదలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 18 న మైదుకూరు సభలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ముగ్గురు పారిశుద్య కార్మికులకు మూడు లక్షల నగదు బహుమతిని ప్రకటించారన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ హామీని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి ఆ ముగ్గురు పారిశుద్య కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మూడు లక్షల నగదు (చెక్కు రూపంలో) బహుమతిని అందించారు.

తమ సేవలను గుర్తించినందుకు పారి శుద్య కార్మికులు ముఖ్యమంత్రికి, కలెక్టరు కు తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జేసి అదితి సింగ్, మైదుకూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *