-వికసిత్ పంచాయిత్ లో భాగంగా స్వయం ఉపాధి అవకాశాలపై హైదరాబాదులోని ఎన్.ఐ.ఆర్.డి లో అవగాహన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారు. జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ మరియు పంచాయితీరాజ్ సంస్థల సహకారంతో వికసిత్ పంచాయిత్ లో భాగంగా పార్లమెంట్ పరిధిలోని రూరల్ నియోజకవర్గాలు నందిగామ, మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేటకి చెందిన 16 మండలాల స్వయం సహాయక సంఘాల సమైక్య అధ్యక్షురాలకు …
Read More »Daily Archives: January 22, 2025
ఆరోగ్య బీమా భవిష్యత్తును అందించు అల్టిమేట్ కేర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థల్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు ఆరోగ్య పరిరక్షణలో ఒక నూతన బెంచ్‌మార్క్ సాధనకు అద్భుతమైన ఆరోగ్య బీమా అల్టిమేట్ కేర్‌ను ఆవిష్కరించినట్లు నేడు ప్రకటించారు. మన అనుకోని వైద్య అత్యవసర పరిస్థితులను పరిష్కరించుటకు మరియు ఆరోగ్యంగా ఉండటానికి రివార్డ్‌లను అందించుటకు అనేక రకాల ప్రయోజనాలను కలిగి ఉన్న పాలసీ అల్టిమేట్ కేర్ ఆరోగ్య బీమా పథకం. పాలసీదారు కోసం ఎన్నో విలువైన అంశాలను జోడించిన ఆరోగ్య …
Read More »భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కార్గో (Cargo) వాహనాల శ్రేణిని ఆవిష్కరించిన మోంట్రా ఎలక్ట్రిక్
– 3.5 టన్నుల స్థూల వాహన బరువుతో ఈవియేటర్ (EVIATOR (e-SCV)) మరియు 1.2 టన్నుల స్థూల వాహన బరువుతో సూపర్ కార్గో (Super Cargo (ఈ – 3 వీలర్)) ఆవిష్కరించబడ్డాయి – ఈవియేటర్ (EVIATOR (e-SCV)) వాహనం పరిశ్రమలోనే అత్యుత్తమంగా 245 కి.మీ. సర్టిఫైడ్ రేంజి మరియు 170 కి.మీ. రియల్ లైఫ్ రేంజితో లభిస్తుంది. అత్యధిక శక్తి – 80 kW మరియు టార్క్ – 300 Nm ఉంటాయి. దీనికి 7 సంవత్సరాలు/2.5 లక్షల కి.మీ. వారంటీ ఉంటుంది. …
Read More »సమస్యలు పరిష్కరించాలంటూ.. మంత్రి గొట్టిపాటితో భేటీ అయిన తెలుగునాడు కార్మిక సంఘం నేతలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తమ సమస్యలు పరిష్కరించాలంటూ.. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నేతలు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో భేటీ అయ్యారు. సచివాలయంలో బుధవారం జరిగిన వీరి భేటీలో పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. సచివాలయాల పరిధిలో ఉన్న సుమారు 7,400 మంది గ్రేడ్ 2 జూనియర్ లైన్ మెన్ లను విద్యుత్ శాఖలో విలీనం చేయడంతో పాటు నాలుగు డిస్క్ంలను ట్రాన్స్ కో పరిధిలోకి తీసుకు రావాలని సంఘం నేతలు కోరారు. అదే విధంగా …
Read More »ఏడుపదుల వయసులో టి.జి. రాజ్యలక్ష్మికి డాక్టరేట్ ప్రదానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త తిరుమల గుడిమెళ్ళ రాజ్యలక్ష్మికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పిహెచ్.డి.పట్టా ప్రకటించింది. విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కృష్ణంరాజు పర్యవేక్షణలో ప్రణవసదృశం విష్ణుచిత్తుని తిరుప్పల్లాండు విష్ణుప్రబంధం అంశంపై శ్రీమతి రాజ్యలక్ష్మి సమర్పించిన సిద్ధాంతవ్యాసానికి వర్సిటీ డాక్టరేట్ పట్టాను ప్రకటించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు డాక్టర్ జె. అప్పారావు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్ గా వ్యవహరించారు. ఏడుపదుల వయసులో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్న రాజ్యలక్ష్మి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని పి.బి. సిద్ధార్థ …
Read More »76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం: జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 76 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహిద్దామని జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయం లోని సమావేశ మందిరం నందు ఈ నెల 26 న నిర్వహించే 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులతో జిల్లా కలెక్టర్ వర్చువల్ గా హాజరై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ డిఆర్ఓ నరసింహులు సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ హాల్ …
Read More »జిఎంసి కార్మికులు సమస్యల పరిష్కారానికి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేసే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు తమ సమస్యలపై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ఈ నెల 23న (గురువారం) సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల వారీగా కార్మికుల సమస్యల పరిష్కారంకు వర్కర్స్ గ్రీవెన్స్ నిర్వహించనున్నామని …
Read More »కృష్ణారావును పరామర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు బావ కృష్ణారావు హృద్రోగంతో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) బుధవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కృష్ణారావు త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే సుజనా ఆకాంక్షించారు.
Read More »సమన్వయంతో ముందుకు వెళ్దాం…
-కార్పొరేటర్ల సమావేశంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ అందరం కలిసి సమన్వయంతో ముందుకు వెళ్దామని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ , టిడిపి జనసేన, బిజెపి పశ్చిమ కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలతో తాడిగడప లోని క్యాంపు కార్యాలయంలో సుజనా సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »పశ్చిమ సమగ్రాభివృద్దే లక్ష్యం
-సమస్యలు గుర్తించండి, పరిష్కరిస్తా… -ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. పశ్చిమ లోని 43,54 డివిజన్ల లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బుధవారం సుజనా చౌదరి పాల్గొన్నారు. 43వ డివిజన్ లోని ఏకలవ్య నగర్ లో రూ 30 లక్షలతో, పోలీస్ కాలనీలో రూ 16 లక్షలతో నిర్మించనున్న సి సి రోడ్ల నిర్మాణానికి 54వ డివిజన్ లో …
Read More »