Breaking News

పశ్చిమ సమగ్రాభివృద్దే లక్ష్యం

-సమస్యలు గుర్తించండి, పరిష్కరిస్తా…
-ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. పశ్చిమ లోని 43,54 డివిజన్ల లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బుధవారం సుజనా చౌదరి పాల్గొన్నారు. 43వ డివిజన్ లోని ఏకలవ్య నగర్ లో రూ 30 లక్షలతో, పోలీస్ కాలనీలో రూ 16 లక్షలతో నిర్మించనున్న సి సి రోడ్ల నిర్మాణానికి 54వ డివిజన్ లో రూ 31 లక్షలతో నిర్మించనున్న కల్వర్టులు, డ్రెయిన్లు, మెట్ల నిర్మాణానికి సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ఏడు నెలల పాలనలో పశ్చిమ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. పశ్చిమ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాను అన్నారు. ఎన్డీయే కూటమి నేతలు అందరూ ఐక్యంగా ఉంటూ ప్రజా సేవలో నిమగ్నమవ్వాలన్నారు. ప్రజల సమస్యల్ని తన దృష్టికి తీసుకు వస్తె పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పశ్చిమ ప్రజలకు ఏ విధమైన సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సుజనా హామీని ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మసాని సుబ్బారావు, స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, కూటమి నేతలు మోరబోయిన రాంబాబు, కొనికి కొండయ్య, పగడాల కృష్ణ, బొల్లెపల్లి కోటేశ్వరరావు, వల్లభనేని లక్ష్మీ ప్రసన్న, తిరుపతి అనూష, ఫతావుల్లా, మైలవరపు దుర్గారావు, మహాదేవు అప్పాజీరావు, గుడివాడ నరేంద్ర రావు, మరుపిళ్ల రాజేష్,అత్తులూరి పెదబాబు, సయ్యద్ సలీం, తాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *