Breaking News

Daily Archives: May 3, 2026

నీట్ పరీక్షలను తనిఖీ చేసిన జేసీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నీట్ పరీక్షలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదివారం తనిఖీ చేశారు. గుంటూరు పట్టణంలో ఏసీ కళాశాల, మహిళ కళాశాల, హిందూ కళాశాలలో జరుగుతున్న పరీక్షల తీరును గమనించారు.

Read More »

కాంట్రాక్టర్ కు షోకాజ్ నోటీసు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బాల కార్మికులతో పనిచేస్తున్న కాంట్రాక్టర్ ఎల్లపు సాయి కుమారుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు గుంటూరు ఉప కార్మిక కమీషనరు ఏ.గాయత్రి దేవి తెలిపారు. ఈనాడు దిన పత్రికలో “మురుగుపాలైన బాల్యం” శీర్షికన ఆదివారం ప్రదురితమైన వార్తపై గాయత్రి దేవి స్పందిస్తూ వివరాలు అందించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పి.పద్మలత ఈ సంఘటనపై ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర మురుగు కాలవల మురుగు తీస్తున్న ప్రదేశాన్ని …

Read More »

టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి ఆర్జీల పరిస్థితి తెలుసుకోవచ్చు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన ఆర్జీల పరిస్థితి తెలుసుకొనుటకు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ దరఖాస్తులను పి.జి.ఆర్.ఎస్ తో పాటు “మీకోసం” వెబ్ సైట్ లో ఆన్ లైన్ లోను సమర్పించవచ్చని తెలిపారు. అర్జీల వివరాలు Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ …

Read More »

జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

-మండల కార్యాలయాల్లో తహసిల్దార్లు ఎంపీడీవోలు ఇతర మండల అధికారులు వినతులు స్వీకరిస్తారు -ఆర్డీవో కార్యాలయాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారి ఇతర డివిజనల్ అధికారులు పాల్గొని స్వీకరిస్తారు -ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరం అయితేనే ఫిర్యాదుదారులు జిల్లా కలెక్టరేట్ కు రావాలి -జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 4 వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం …

Read More »

ఐక్యపోరాటాలతో సామాజిక న్యాయం సాధ్యం

-బూర్జువ పాలకులతో నిమ్నజాతులకు న్యాయం కల: ఈశ్వరయ్య -డిసెంబరులో హక్కుల సాధనకు డీహెచ్పీఎస్ భారీ ఉద్యమం -ఘనంగా డీహెచ్పీఎస్ రాష్ట్ర 3వ మహాసభ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివక్షతలు ఎదుర్కొంటూ అనేక అవమానాలకు గురౌవుతున్న దళిత, గిరిజన వర్గాలు సామాజిక న్యాయం పొందటానికి ఇక్కపోరాటాలు చేయాల్సిన అవసరం ఉండని వక్తలు ఉద్ఘాటించారు. దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) రాష్ట్ర 3వ మహాసభ సంస్థ అధ్యక్షుడు జేవీ ప్రభాకర్ అధ్యక్షతన విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఆదివారం జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న …

Read More »

ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలు – సామాన్యుడిపై ధరల భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వంపై… : జి.కోటేశ్వరరావు ఆగ్రహం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీస్తోందని, నిత్యావసర వస్తువులతో పాటు వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద భారీ ధర్నా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ​​ ఎన్నికల ప్రక్రియ ముగియగానే, ఏమాత్రం కనికరం లేకుండా ధరలు పెంచడం ప్రజలను వంచించడమే అన్నారు. ప్రస్తుతం గ్యాస్ ధరలు …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 4 వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

ఈ నెల 4న ఎ.కొండూరు, తిరువూరు, రెడ్డిగూడెం, గంప‌ల‌గూడెం, విస్స‌న్న‌పేట‌లో ప్రత్యేక గ్రీవెన్స్

– స్థానిక ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 4వ తేదీ సోమ‌వారం ఎ.కొండూరు తిరువూరు, రెడ్డిగూడెం, గంప‌ల‌గూడెం, విస్స‌న్న‌పేట మండ‌ల కేంద్రాల్లో ప్ర‌త్యేక ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎ.కొండూరు కి సంబంధించి ఎంపీడీవో కార్యాలయంలో, మిగిలిన నాలుగు మండలాలకు సంబంధించి ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ఉద‌యం 10 గంట‌ల నుంచి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని, …

Read More »

ప్రశాంతంగా ముగిసిన నీట్‌-2026 ప‌రీక్ష‌

– 98.69 శాతం హాజ‌రు న‌మోదు – ప‌రీక్షా కేంద్రాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా నిర్వ‌హించిన జాతీయస్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ (యూజీ)-2026 ఆదివారం ఎన్‌టీఆర్ జిల్లాలో ప్ర‌శాంతంగా ముగిసింది. జిల్లాలో 32 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించ‌గా మొత్తం 11,496 మంది అభ్య‌ర్థుల‌కుగాను 11,345 మంది (98.69 శాతం) హాజ‌రైన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప‌రీక్ష ప్ర‌క్రియ‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించడంతోపాటు …

Read More »

వ‌డివ‌డిగా జ‌ల‌ధార.. ఒడిసిప‌ట్టు జీవ‌ధార‌

– జిల్లాలో ముమ్మ‌రంగా సాగుతున్న ప‌నులు – మంజూరైన 197 ప‌నుల్లో 88 ప‌నులు ప్రారంభం – త్వ‌ర‌లో మ‌రికొన్ని ప‌నులకు శ్రీకారం – క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కార్య‌క్ర‌మం అమ‌లు – శాస్త్రీయ దృక్ప‌థంతో ప‌దేళ్ల డేటా ఆధారంగా కార్యాచ‌ర‌ణ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీటి భద్రత ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన జ‌ల‌ధార‌-జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మం కింద ఎన్‌టీఆర్ జిల్లాలో ప‌నులు వ‌డివ‌డిగా ముందుకెళ్తున్నాయి. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ముఖ్య‌మంత్రి …

Read More »