– జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడ నగరంలోని మాచవరం ప్రాంతంలో జిల్లా మలేరియా అధికారి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతో కలిసి ఇంటింటి అవగాహన కార్యక్రమం, డెంగ్యూ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా వంటి …
Read More »Daily Archives: July 10, 2026
జిల్లాలో 77.88 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్
– సహకారాన్ని కొనసాగిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – సర్‌పై రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలోని కీలకదశ అయిన ఇంటింటి సర్వే సాఫీగా సాగుతోందని.. ఇప్పటివరకు 75 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ప్రక్రియలో కీలక సహకారం అందిస్తున్న రాజీకీయ పక్షాలు మరింత సహకారంతో కార్యక్రమం విజయవంతానికి చేయూతనివ్వాలని కోరారు. శుక్రవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి …
Read More »ఆర్టీఐ నిబంధనల అమలులో నిర్లక్ష్యం సహించం
-ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తప్పవు -రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) లోని సెక్షన్ 4 (1) (బి) నిబంధనలను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా అమలు చేయాలని, చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆర్టీఐ చట్టం అమలుపై శుక్రవారం విజయవాడ రూరల్‌లోని గొల్లపూడిలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ …
Read More »సమాచార హక్కు అమలు.. సుపరిపాలనకు నిదర్శనం
– ప్రజలకు సమాచారమే శక్తి.. ఆ హక్కు పరిరక్షణే అధికారుల బాధ్యత – రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం స్పష్టీకరణ – విజయవాడలో ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృత తనిఖీలు – నిబంధనలు ఉల్లంఘించిన కార్యాలయాలకు షోకాజు నోటీసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత బలోపేతమవుతాయని రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం స్పష్టం చేశారు. ప్రజలకు సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి …
Read More »దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి వేదికగా పీజీఆర్ఎస్
– ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎంతో మేలు – విజయవాడ తూర్పులో స్థానిక ప్రజల నుంచి మొత్తం 61 అర్జీలు – కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాస్థాయిలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌తో పాటు ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, …
Read More »నూతన అదనపు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఐ. కిషోర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థకు నూతన అదనపు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఐ. కిషోర్ నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ను ఆయన ఛాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ జారీ చేసిన జి.ఓ ఆర్.టి నెంబర్ 888 ప్రకారం బదిలీ చేయగా నేడు నగర పాలక సంస్థలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Read More »పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారం ఇంకా అందని ఓటర్లు ఉంటే సమీప సచివాలయంలో సిబ్బందిని, లేదా వార్డ్ ల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లను సంప్రదించి ఫారం పొందాలని, మరో 4 రోజుల్లో గడువు ముగుస్తున్నందున ఫారాలు అందిన వారు వెంటనే పూర్తి చేసి ఇవ్వాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. శుక్రవారం పట్టాభిపురం, ఐపీడీ కాలనీ, …
Read More »ప్రభుత్వ అధికారులు నిర్దేశిత సమాచారం గడువులోగా ఇవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీఐ చట్టం ప్రభుత్వ పారదర్శక పాలనను ప్రజలకు తెలియడానికి రూపొందించిన చట్టమమని, చట్ట ప్రకారం ప్రభుత్వ అధికారులు నిర్దేశిత సమాచారం గడువులోగా ఇవ్వాలని, చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సిటిజన్ చార్టర్, అధికారుల వివరాలతో కూడిన బోర్డ్ లను పరిశీలించి, ఆర్టీఐ చట్టం సెక్షన్ …
Read More »రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాలు ఎవరికైనా అందకుంటే వార్డ్ లలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లు, సమీప సచివాలయాలు లేదా ఇంటింటికి వచ్చే బిఎల్ఓలకు అందించాలని, బిఎల్ఏలు కూడా సహకరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) పై గుర్తింపు పొందిన …
Read More »జిటిఎస్ నిర్మాణ పనులని వేగవంతం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్ల (జిటిఎస్) నిర్మాణ పనులని వేగవంతం చేయాలని, నిర్మాణ పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏటుకూరు రోడ్ లో నిర్మాణంలో ఉన్న జిటిఎస్ పనులను, అనంతరం జాతీయ రహదారి వెంబడి పారిశుధ్య పనులను ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర …
Read More »
Prajavartha Online Telugu News