Daily Archives: July 10, 2026

నగరంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) సంబంధించి నగరంలోని వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటికి అదనంగా ప్రజలు, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే గుంటూరు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో కూడా ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ల వద్ద ప్రతిరోజు ఉదయం …

Read More »

న్యాయమైన బీసీ డిమాండ్ లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి… : భాస్కర బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయమైన బీసీ డిమాండ్ లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించటానికి ఇప్పటికైనా స్పందించాలని పంచ వృత్తుల సంక్షేమ సంఘంరాష్ట్ర అధ్యక్షులు భాస్కర బాబు కోరారు. శుక్రవారం ధర్నా చౌక్ లో బీసీ డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నా లో పంచ వృత్తుల సంక్షేమ సంఘంరాష్ట్ర అధ్యక్షులు భాస్కర బాబు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచాలని దశాబ్దాలుగా బీసీలు పోరాడుతున్న ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, …

Read More »

నూతన ఔషధాలతో మానవజాతికి మహోపకారం

-పి.బి. సిద్ధార్థలో ఆస్ట్రాజెనికా సైంటిస్ట్ డా.తాటి రమేశ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జీవశాస్త్రరంగంలో పరిశోధనలతో గతంలో చికిత్సకు లొంగని వ్యాధులకు నూతన మందులు తయారవుతూ మానవాళికి మహోపకారం చేస్తున్నాయని, ఔషధ తయారీరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఆస్ట్రాజెనెకా (స్వీడన్) పరిశోధన విభాగం సీనియర్ శాస్త్రవేత్త డా. తాటి రమేష్ అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జీవశాస్త్రాల విభాగాలు శుక్రవారం వెబినార్ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఔషధ ఆవిష్కరణ, నూతన ధోరణులపై కీలకోపన్యాసం చేస్తూ మందుల …

Read More »

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని ధర్నా చౌక్ లో బీసీ డిమాండ్లపై మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు , బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచాలని దశాబ్దాలుగా బీసీలు పోరాడుతున్న ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమన్నారు, బీసీ రిజర్వేషన్లు పెంచకపోవడం వలన బీసీలు విద్యా ఉద్యోగ …

Read More »

కృష్ణా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా బాధ్యతలు చేపట్టిన పి. జయరావు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా (ఎఫ్‌ఏసీ) పి. జయరావు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో డిఐపిఆర్ఓ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలు …

Read More »

సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల సహకారం అవసరం

-పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పారదర్శకంగా చేపడుతున్నాం -జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా మిగిలిపోకుండా రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు చురుకుగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కోరారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తిస్థాయి పారదర్శకతతో చేపడుతున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్‌లోని తన …

Read More »

ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ అన్నారు. శుక్రవారం ఉదయం అయోధ్య నగర్ పరిసర ప్రాంతాలలో లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా …

Read More »