-శివనాథ్ (చిన్ని) ఆటోనగర్ లో వివిధ మార్గాల లారీలు ప్రవేశించేందుకు పలు రోడ్లు పరిశీలన
-బల్లెం వారి వీధి, మహానాడు రోడ్, శక్తి కళ్యాణ మండపం రోడ్లు పరిశీలన
-ఈ ఏరియాల్లో పర్యటించిన ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొద్ది రోజుల్లో మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్‌తో పాటు, తొలిదశలో గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు మొదలైతే విజయవాడలో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరుగుతుంది. అలాగే ఆటోనగర్ లోకి లారీలు రావటం కష్టంగా మారుతుంది. అందుకని ఫ్లైఓవర్, మెట్రో కారిడార్ పనులు పూర్తి అయ్యే వరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించి, వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోనున్నట్లు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలపారు. సోమవారం ఉదయం ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ లతో కలిసి ఆటోనగర్ లోని బల్లెం వారి వీధి, మహానాడు రోడ్, శక్తి కళ్యాణ మండపం రోడ్లు పరిశీలించారు.ఆ ప్రాంతాల్లో పర్యటించి చేపట్టాల్సిన రహదారుల అభివృద్ది పనులతో పాటు లింక్ రోడ్లను పరిశీలించారు. ఈ రహదారుల్లోకి లారీలు అనుమతి ఇస్తే ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వుంటుందనుకున్నారు. అలాగే గన్నవరం వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా రామవరప్పాడు నుంచి ఎస్.ఎల్.వి గ్రాండ్ మీదు కేసరిపల్లి కి వెళ్లే రహదారిని పరిశీలించారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న విజయవాడ నగర అవసరాలకు తగ్గట్లు దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులపై దృష్టిపెట్టిందని.. ఈ నేపథ్యంలో సమష్టి కృషితో పక్కా ప్రణాళికతో రహదారులతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. నగరంలో అభివృద్ధి పనుల నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రజలు సజావుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఇప్పటినుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారిస్తున్నట్లు పేర్కొన్నారు.. మహానాడు రోడ్డు నుంచి నిడమానూరువరకు ఫ్లైఓవర్‌తో పాటు తొలిదశలో గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు పూర్తయితే విజయవాడ మరింత శరవేగంగా అభివృద్ధి పథంలో పయనించేందుకు వీలవుతుందన్నారు.. ఈ పనులు పూర్తయ్యేలోపు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నట్లు వివరించారు. ఆటోన్గర్ ప్రాంతంలోకి రాకపోకలు సాగించే లారీల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో భాగంగా మురళీ నగర్ నుంచి బల్లెంవారి వీధి వరకు ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. అదేవిధంగా గన్నవరం విమానాశ్రయానికి రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి ప్రత్యామ్నాయ మార్గంపైనా, రహదారుల పనులపై దృష్టిసారించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపినట్లు ఎంపీ వివరించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు, నగర అభివృద్ధికి ఎంపి కేశినేని శివనాథ్ శాయశక్తులా కృషిచేస్తున్నారన్నారు. .. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో కలిసి నగరంలో ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా కృషిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతోనేన సాధ్యమని స్పష్టం చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విజయవాడ రహదారులతో పాటు మౌలిక వసతుల మరింత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలుచేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, భవిష్యత్తులో చేపట్టనున్న పనులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలు, రహదారుల పనులపై దృష్టిసారిస్తున్నట్లు వివరించారు. రాజధాని అమరావతికి రాకపోకలకు విజయవాడ రోడ్లు ప్రధానమైనవన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ , సబ్ కలెక్టర్ కావూరి చైతన్య , ఈస్ట్ తహసిల్దార్ రోహిణి దేవి , కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, ఐల మాజీ చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ , టిడిపి నాయకులు గద్దె రమేష్ , సూరపనేని సురేష్, కోనేరు నాగేంద్ర కుమార్ (నాని), గొల్లపూడి నాగేశ్వరావు , కోడూరు ఆంజనేయ వాసు , గుళ్లపల్లి నారాయణరావు , మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు…