ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం గురువారం అనగా ది.22-07-2021 నుండి ది.24-07-2021 వరకు దేవస్థానం నందు వైభవంగా నిర్వహించు శ్రీ అమ్మవారి శాకాంబరీ దేవి ఉత్సవములు రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణి మోహన్, ఐఏఎస్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ శ్రీ అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ వారు శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు సందర్భంగా దేవస్థానం మరియు ప్రాంగణములు యందు ఆకుకూరలు మరియు కూరగాయలుతో చేసిన అలంకరణలు, భక్తుల సౌకర్యార్థం దేవస్తానం నందు చేసిన ఏర్పాట్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం దేవస్థానం నందు జరుగుచున్న ఇంజినీరింగ్ పనులను గురించి కార్యనిర్వహణాధికారి వారు మరియు ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ వారు అభివృద్ధి పనుల గురించి వివరించగా, ప్రిన్సిపల్ సెక్రటరీ పలు సూచనలు చేశారు.
Tags indrakiladri
Check Also
పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…
-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …