-ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ మూతల్ని రోడ్డు లెవెల్ లోకి సరిచేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం తన పర్యటనలో భాగంగా 23వ డివిజన్ కార్పొరేటర్ మరియు టిడిపి ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తో కలిసి ఆ డివిజన్లోని ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా బిసెంట్ మహంతి మార్కెట్, కర్నాటి రామ్మోహన్ రావు స్కూల్, చలసాని వెంకటరత్నం వీది, ప్రకాశం రోడ్డు, పొగాకు బారెల్ రోడ్డు, కాలేశ్వరం రోడ్డు, మరియు ఐవీ ప్యాలెస్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
23వ డివిజన్ నందు డివిజన్ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి, కమిషనర్ తో కలిసి 23వ డివిజన్ నందు సచివాలయం 93 మరియు,97,98 ఏరియాలలో సమస్యలను కమిషనర్ కి తెలియజేశారు. కర్నాటి రామ్మోహన్ రావు స్కూల్ నందు స్కూల్ ప్రహరీ గోడ పడిపోవటం వలన చాలా ఇబ్బందిగా ఉందని వెంటనే ఆ గోడను నిర్మాణం చేయవలసిందిగా కమిషనర్ ని కోరగా వెంటనే సిఇ ని ఎస్సీ ని పిలిచి ఆ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు. మరియు డివిజన్ నందు ముఖ్యమైన సమస్యలను తెలియజేయుచు కమిషనర్ కి వివరిస్తూ మొట్టమొదటిగా చలసాని వెంకటరత్నం వీది, ప్రకాశం రోడ్డు, పొగాకు బారెల్ రోడ్డు, కాలేశ్వరం రోడ్డు, మరియు ఐవీ ప్యాలెస్ లో సెల్లార్ లో ఉన్న ఫర్నిచర్ తీయించవలసిందిగా. ఆదేశించినారు మరియు ఉమెన్స్ లేడీస్ హాస్టల్ ప్రహరీ గోడ నిర్మాణము వెంటనే చేపట్టినందుకు కమిషనర్ కు కార్పొరేటర్ ధన్యవాదాలు తెలియజేశారు. మరి ముఖ్యంగా బీసెంట్ రోడ్ లోని ఫిష్ మార్కెట్ మొత్తం పరిశీలించి వాటికి సంబంధించిన సమస్యలను సీఈ కి మరియు ఎస్సీ ప్రాజెక్ట్ కి పరిష్కారం చేయవలసిందిగా ఆదేశిస్తూ మరియు ఎస్టేట్ ఆఫీసర్ను , బీసెంట్ రోడ్ లోని ఉన్న ప్రధానమైన కమర్షియల్ బిల్డింగ్ ల మీద వివరణ ఇవ్వాల్సిందిగా ఎస్టేట్ ఆఫీసర్ ను వివరణ కోరి ఉన్నారు. లెనిన్ సెంటర్ నందు ఉన్న పార్కును పరిశీలించి ఏడిఎచ్ కి తగు సూచనలు చేసి ఉన్నారు.
ఈ కార్యక్రమంలో C. M. O. H, S.C ప్రాజెక్టు గారు,C.E. ఇంజనీరింగ్ సిబ్బంది.శానిటరీఇన్స్పెక్టర్ మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది. సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.