జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డుకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై, నిర్మాణ పనులపై ఎన్హెచ్ఎఐ, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మరింత వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

బుధవారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులకు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు తదితరాలకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై, నిర్మాణ పురోగతిపై జెసి శుభం బన్సల్ తో కలిసి వారం వారం సమీక్షలో భాగంగా వర్చువల్ విధానంలో ఎన్హెచ్ఎఐ పిడి లు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్డీఓ లు తిరుపతి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి రామ్మోహన్, కిరణ్మయి, భాను ప్రకాష్ రెడ్డి సంబంధిత మండలాల తాసిల్దార్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న కడప – రేణిగుంట , తిరుపతి – మదనపల్లి , రేణిగుంట – నాయుడుపేట 6 లేన్ వంటి రహదారులు నిర్మాణం, తిరుపతి బైపాస్ వేగవంతం చేయాలని, రేణిగుంట నుండి చెన్నై వరకు 4 లేన్ల రహదారి విస్తరణ పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని భూ సేకరణలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

భూసేకరణ పెండింగ్ అవార్డులు త్వరిత గతిన నిబంధనల మేరకు చేపట్టేలా ఉండాలని తెలిపారు. ప్యాకేజీ 2,3,4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎన్ హెచ్ అధికారులు సమన్వయంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

రైల్వే ప్రాజెక్టులు నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ కు సంబంధించిన భూ సేకరణలో ఇబ్బందులు లేకుండా ఆర్డీఓ లు, తాశిల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి పాకాల రైల్వే ట్రాక్ డబుల్ లైన్ కు సంబంధించిన భూ సేకరణ పనులలో పురోగతి ఉండాలని తెలిపారు. అలాగే తిరుపతి రేణిగుంట బైపాస్ సంబంధించిన పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ లను ఆదేశించారు.

ఈ సమావేశంలో పిడి ఎన్హెచ్ఎఐ లు తిరుపతి వెంకటేష్, నెల్లూరు ఎంకే చౌదరి, చెన్నై రవీంద్రరావు, తాసిల్దార్లు కలెక్టరేట్ విభాగం డిటి భాస్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం

ఇంద్రకీలాద్రి,  నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమ‌వారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *