తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల వద్దకు పాలనా సందర్భంగా రెవిన్యూ సదస్సులు జరుగుతున్న నేపధ్యంలో గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి బుధవారం తిరుపతి జిల్లాలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవడానికి అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ వేదికను మండల గ్రామ స్థాయిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకు జిల్లావ్యాప్తంగా నేడు 24 గ్రామ సభలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజలకు భుసమస్యలు పరిష్కరించుకోనుటకు అనువైన వేదిక రెవెన్యూ సదస్సులు అని ఈ వేదికను మండల గ్రామ స్థాయిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రెవిన్యూ సదస్సులలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల రెవెన్యూ, సంబందిత అధికారులు పాల్గొని విజయవంతంగా రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని అక్కడికక్కడే పరిష్కరించారన్నారు. తిరుపతి జిల్లాలో మొదటి రోజు నుండి నేటి వరకు జిల్లావ్యాప్తంగా 16459 అర్జీలు అందాయని అందులో నేడు 149 అర్జీలు వచ్చాయని అందులో అసైన్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్ పై-8, అసైన్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ పై -11, క్యాస్ట్ వెరిఫికేషన్-0, మీ సేవ ద్వారా రెవెన్యూ పై-0, రీ సర్వే పై-9, ల్యాండ్ గ్రాబింగ్ పై -0, ఫాం 22ఎ పై -0, ఆర్ ఓ ఆర్ పై -81, ఇనాం పై-0, ఇతర విషయాలకు సంబంధించి 35 వచ్చాయని తెలిపారు. ఈరోజు మరియు ముందుగా వచ్చిన మొత్తం అర్జీలలో 434 అర్జీల సమస్యలను పరిష్కరించడం జరిగిందని మిగిలిన అర్జీల సమస్యలను కాల పరిమితి లోపల సంబందిత అధికారులు పరిష్కరిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Tags tirupathi
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News