మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టుదల కృషితో ఏదైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక హిందూ కళాశాల గ్రౌండ్స్ లో సంక్రాంతి స్టెమ్ క్రీడల పోటీలు- 2025 కార్యక్రమంలో గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళనారాయణరావు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా హ్యారీ పోటర్ నవల రచయిత్రి తన జీవితంలో పేదరికంలో జీవిస్తూ ఏ విధంగా గొప్ప రచయిత్రిగా పేరుగాంచిందో ఆమె విద్యార్థులకు స్ఫూర్తిగా వివరించారు జీవిత కథను విద్యార్థులకు వివరించి వారిలో స్ఫూర్తిని నింపారు. జీవితంలో పట్టుదల కృషితో ఏదైనా సాధించవచ్చనే సందేశాన్నిచ్చారు.
జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యతోపాటు వ్యాసరచన క్విజ్ వక్తృత్వ పోటీల వంటి జ్ఞాన సమపార్జున కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. రాజు ఆ రాజ్యంలోనే పూజ్యుడట, పండితుడు సర్వత్ర పూజ్యుడట అనే నానుడి ఉందని, జ్ఞాన సంపన్నులు ప్రపంచమంతా కీర్తించబడతారని, కావున జ్ఞాన సముపార్జన కోసం కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. తొలుత వీర్నాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలాజీ వీర్నాల సంస్థ కార్యకలాపాలు వివరించారు.
6 నుండి 8 తరగతుల విద్యార్థులకు, 9, 10 తరగతుల విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకువ్యాసరచన, క్విజ్, డిబేట్, చదరంగం, గణిత ఒలంపియాడ్ లో నిర్వహించిన పోటీలలో విజేతలకు మెడల్, మెమెంటో, నగదు బహుమతులు అందజేశారు.