-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డీసిల్టింగ్ ప్రక్రియను వెంటనే మొదలు పెట్టమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు తన పర్యటనలో భాగంగా, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఈట్ స్ట్రీట్, ఏలూరు రోడ్డు, మాచవరం, ఈ ఎస్ ఐ హాస్పిటల్, క్రీస్తురాజుపురం, ఏ ఎస్ రామ రావురోడ్డు, హరిజన వాడ, లోయల కాలేజీ రోడ్డు, మధు చౌక్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీ వర్షాలు పడినప్పుడు వర్షపు నీటి నిలువలు రోడ్డు మీద నిలిచి ఉండే ప్రదేశాలను 72 ఉన్నాయని అధికారులు గుర్తించగా వాటిని నిరంతరం డీసిల్టింగ్ చేసుకుంటూ భారీ వర్షాలు పడినా, వర్షపు నీటి నిలువలు రోడ్డు మీద నిలవకుండా ఉండేటందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రధాన ఔట్ఫాల్ట్ డ్రైన్లో కలిసే, డ్రాయింలను ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ డిసిల్టింగ్ చేసుకుంటూ ఉండాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ఏలూరు రోడ్, మాచవరం ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ పొంగటం గమనించి వెంటనే చర్యలు తీసుకొని ఆ సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్రీస్తు రాజపురం, హరిజనవాడలో ఎప్పటినుండో నిలిచి ఉన్న పాత ద్విచక్ర, 4 చక్ర వాహనాలను పోలీస్ వారి సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈఎస్ఐ హాస్పిటల్ నందు పాడైపోయిన కలవర్ట్ ను గమనించి వెంటనే మరమతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు, మధు చౌక్ సెంటర్ వద్ద గుహల ముందు డ్రైన్ నిర్మాణంను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇంజనీరింగ్మరి, టౌన్ ప్లానింగ్ సమన్వయంతో రోడ్లు పైనున్న నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి పాల్గొన్నారు.