Breaking News

రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
“ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP విభాగంలో పనిచేస్తున్నఅధికారులు డాక్టర్ ఇషదీప్ మరియు డాక్టర్ దివ్య వారు గుంటూరు జిల్లా కలెక్టరేట్’లో జిల్లా కలెక్టర్ నాగ లక్ష్మి .యస్. I.A.S. మరియు ఆసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ I.A.S. వారిని కలవటం జరిగింది. తరువాత కలెక్టరేట్ వి.సి హాలు నందు ఏర్పాటు చేసినఫోటో ఎగ్జిబిషన్ మరియు గుంటూరు  జిల్లారైతులు  పండించిన కొన్ని మిరప రకాలను వీక్షించారు. తదుపరి ODOP documentation పై చర్చించి సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమమునకు అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ I.A.S. అధ్యక్ష్యతవహించారు. డాక్టర్వై.యస్.ఆర్. ఉద్యాన వర్సిటీ, హెచ్.ఆర్.యస్., లాం ని సందర్శించి మిరప రకాలను మరియు వారు చేపడుతున్న projectsగూర్చితెలుసుకున్నారు. అనంతరం లాం, ఆర్.యస్.కే.ని సందర్శించి డిజిటల్ గ్రీన్ వారు రైతులకు అందిస్తున్నసేవలను గురించి తెలుసుకున్నారు. అనంతరం అంకిరెడ్డిపాలెంలో ఉద్యాన శాఖ ద్వారా రాయితీ పొందిన విశ్వ సాయి ఫుడ్స్& కోల్ట్ స్టోరేజ్’ని సందర్శించారు. రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలించారు. తరువాత AMC, మార్కెట్ యార్డ్ మరియు స్పైస్ బోర్డును సందర్శించి వారు చేపడుతున్న projectsను తెలుసుకోవడం జరిగింది. హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లాంలోని క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ ను మరియు స్పైస్ బోర్డు లోని ల్యాబ్ ను కూడా సందర్శించి మిరప పండించు రైతులకు మరియు ఎగుమతిదారులకు వాటి వలన కలుగు ప్రయోజనములను పరిశీలించుట జరిగింది. ఈ కార్యక్రమములోజిల్లా ఉద్యాన అధికారి, గుంటూరు (బి.రవీంద్ర బాబు) మరియు ఉద్యాన అధికార్లు మరియు హ్యాండ్’లూమ్స్ శాఖాధికారులు పాల్గొనడం జరిగినది. అదే విధముగా సంబంధిత ప్రదేశాలలో డాక్టర్ సి.వి.రమణ, డాక్టర్ సి. శారద మరియు అనన్ దేబ్బర్మ, డి.డి.,స్పైస్ బోర్డు మొదలగు అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వైద్య, ఆరోగ్య శాఖ‌లో ఏడెనిమిది వేల ఖాళీల భ‌ర్తీకి మంత్రి ఆదేశం

-ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌ల‌కు డాక్ట‌ర్లు, పేరా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కం అవ‌స‌ర‌మ‌న్న మంత్రి -మంజూరైన పోస్టులు, ఖాళీల‌పై మంత్రి స‌త్య‌కుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *