-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ‘ఈ- డిస్ట్రిక్ మేనేజర్’ పోస్టుకు ఒప్పంద ప్రతిపాదికన పని చేసేందుకు అభ్యర్థుల నుంచి స్వీకరించిన వాటిలో దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హుల తాత్కాలిక జాబితా సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఆ మేరకు అర్హుల తాత్కాలిక జాబితా రూపొందించి తూర్పు గోదావరి జిల్లా అధికారిక వెబ్సైటు https:///eastgodavari.ap.gov.in లో పెట్టినట్లు తెలిపారు. ఈ అర్హుల తాత్కాలిక జాబితా పై ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే జనవరి 10 నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కలెక్టరేట్లోని పరిపాలన అధి కారి విభాగంలో తగిన ఆధారాలతో సమర్పించాలని కోరడం జరిగింది. వాటిని పరిశీలించిన తర్వాత అర్హుల తుది, అనర్హుల జాబితాలు వెబ్సైట్లో మళ్లీ పొందుపరుస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈలోగా ఎటువంటి ఫిర్యాదులు రానీ ఎడల ఆ జాబితాను అర్హత కలిగిన వాటిగా పరిగణనలోనికి తీసుకొవడం జరుగుతుందని పేర్కొన్నారు.