నేలపట్టు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నేపథ్యంలో దొరవారి సత్రం మండలం, నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించి, సందర్శకుల కొరకు ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సూళ్లూరుపేట ఆర్ డి ఓ కిరణ్మయి కలిసి స్వయంగా పర్యాటక ప్రదేశాలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నేలపట్టు పక్షుల కేంద్రంను సందర్శించు పర్యాటకులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా భద్రత ఏర్పాట్లు, మౌలిక వసతులు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. పర్యాటక ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్శకులను ఆప్యాయంగా పలకరిస్తూ నేల పట్టు పక్షులకేంద్రం లోని పర్యటన ఏర్పాట్లు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యలు తెలుపగా పరిష్కరించే దిశగా.. అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో నాయుడుపేట డిఎస్పి చెంచుబాబు, దొరవారిసత్రం ఎస్ ఐ అజయ్ కుమార్, ఎఫ్ ఆర్ ఓ సౌజన్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, డి పి ఓ సుశీలాదేవి, తాసిల్దార్ శైలా కుమారి తదితరులు పాల్గొన్నారు.