అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నటుడుగా ఆయన స్ఫురణకు వస్తే ఆయన అభినయించిన పాత్రలే కళ్ల ముందు మెదులుతాయి. రాజకీయ నేతగా తలంపుకొస్తే ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయి. అంతటి బలీయమైన ముద్ర వేసిన నందమూరి తారక రామారావు తెలుగు వారైనందుకు తెలుగువారందరికీ గర్వకారణం. ఆ మహాపురుషుడు వర్థంతి సందర్భంగా నీరాజనాలు అర్పిస్తున్నాను. ఆయన నట జీవితం, రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శనీయం… ఆచరణీయం అని ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
