క్లస్టర్ స్కూలు కాంప్లెక్స్ సమావేశ ఏర్పాట్ల పై కలెక్టరు సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్‌ల పునర్ వ్యవస్థీకరణపై జనవరి 21న రాజమహేంద్రవరం లో ప్రాంతీయ కార్యశాల ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.

శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో క్లస్టర్ స్కూలు కాంప్లెక్స్ సమావేశ ఏర్పాట్ల పై కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి సూచనలు జారీ చేస్తూ, ప్రాంతీయ సదస్సు ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో భాగంగా జనవరి 21 న కళాకేంద్రం లో నిర్వహించనున్న వర్క్ షాప్ (కార్యశాల)కు తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డా బి ఆర్ అంబేద్కర్ జిల్లా, రంపచోడవరం రెవిన్యూ డివిజన్ నాలుగు జిల్లాల నుంచి జిల్లా పాఠశాల విద్యాధికారి, సుమారు 25 అసెంబ్లీ నియోజక వర్గాలు క్లస్టర్ ఏరియాలో అన్ని క్షేత్రస్థాయి కార్యదర్శుల మండల పాఠశాల విద్యాధికారులు 1 మరియు 2 , అన్ని రంగాల కార్యదర్శులు పాల్గొననున్న దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య అతిథి గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ్ రామ రాజు తోపాటు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొననున్నట్లు తెలిపారు. గ్రూప్ డిస్కషన్ కోసం జిల్లాల వారీగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.

కార్యశాల అనంతరం గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించి సూచనలను సలహాలను స్వీకరించడం జరుగుతుందని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ జి . నాగమణి తెలియ చేశారు. మొత్తం ఈ ప్రాంతీయ సదస్సు కు 343 క్లస్టర్ ఏరియాలో ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఎమ్ ఈ వో లు, డిప్యూటి విద్యా అధికారులు, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లు , క్లస్టర్ ఏరియాలో ఉన్న ఇంటర్మీడియట్, వొకేషనల్ కళాశాల ప్రధానోపాధ్యాయులు తదితరులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 900 మంది పాల్గొనడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశం లో ఆర్డీవో లు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జే వి వి సుబ్రహ్మణ్యం, జిల్లా వొకేషనల్ కోర్సు అధికారి ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం, ఎస్ ఎస్ ఎ పిడి ఎస్. సుభాషిణి లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.టి.ఆర్. జీవితం ఆదర్శనీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నటుడుగా ఆయన స్ఫురణకు వస్తే ఆయన అభినయించిన పాత్రలే కళ్ల ముందు మెదులుతాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *