అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.
1.వ్యవసాయం మరియు సహకార శాఖ……
-2024-25 ఖరీప్ ధాన్యం సేకరణ కార్యకలాపాలు కొనసాగించేందుకు అవసరమైన నిధులను నేషనల్ కోఆపరేటివ్ డవలెప్మెంట్ కార్పొరేషన్ (NCDC) నుండి ఎ.పి. స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (AP MARKFED) అదనపు ఋణ సౌకర్యంగా రూ.700 కోట్ల మేర ఋణాన్ని పొందేందుకు (ఇప్పటికే పొందిన రూ.6000.00 కోట్ల రుణానికి అదనంగా) ప్రభుత్వ హామీని పొడిగించడం మరియు ప్రభుత్వ గ్యారంటీ కమీషన్‌ను మాఫీ చేయడంతో పాటు ఆ నిధులను AP స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSCL) కు బదిలీ చేయడం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలు మరి కొన్ని సందర్బాల్లో కేవలం 6 లేక 7 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి సొమ్మును జమచేస్తున్నది కూటమి ప్రభుత్వం.
-ఈ సీజన్ లో 28,083,238 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దాదాపు 4.6 లక్షల మంది రైతుల నుండి సేకరించి వారికి రూ.6,469 కోట్లను చెల్లించడం జరిగింది.
-ఇంకా కొంత ధాన్యాన్ని సేకరించాలనే లక్ష్యంతో ఈ ఋణాన్ని తీసుకోవడం జరుగుచున్నది.
-ప్రస్తుత సీజన్ లో ధాన్య సేకరణ విషయంలో ఎదురైన మాయిచ్చర్ సమస్యను వచ్చే సీజన్ లో అధిక మించే విధంగా మాయిచ్చర్ ఫుల్ ప్రూఫ్ విదానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
2.ఇంధన శాఖ….
-A.P. ఫెర్రో అల్లాయ్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అభ్యర్థనపై G.O.Ms.No.26 శక్తి (పవర్-III) విభాగం, తేదీ: 16.11.2023 లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తేదీ.31-03-2025 వరకు టారిఫ్ & విద్యుత్ సుంకంలో అదే తగ్గింపును కొనసాగించేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-దీని మూలంగా దాదాపు రూ.300 కోట్ల మేర అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది.
-ఈ ఫెర్రో అల్లాయ్స్ లో పని చేస్తున్న దాదాపు 40 వేల మంది ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
-ఉమ్మడి రాష్ట్రంలో గతంలో పల్వంచలోని నవబాగ్ ఫెర్రో అల్లాయ్స్ కు కూడా ఇటు వంటి సహకారాన్ని ఈ ప్రభుత్వం అందించడం జరిగింది.
3.పురపాలక & పట్టణాభివృద్ది శాఖ….
-వివిధ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలో మిగిలిన 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్‌లను (ఒక్కో అన్న క్యాంటీన్ ను రూ.61 లక్షలతో) మొత్తం అంచనా వ్యయం రూ.38.43 కోట్లతో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-రాష్ట్రంలో ఇప్పటికే 203 అన్నా కాంటిన్లను ఏర్పాటు చేయడం జరిగింది.
-పూటకు కేవలం రూ.5/- లకే కడుపు నిండా శుచి కరమైన భోజనం పెట్టే మహత్తర కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది.
-ఈ క్యాంటీన్ల నిర్వహణను మరింత మెరుగు పర్చేందుకు ప్రత్యేకంగా సొసైటీని ఏర్పాటు చేయాలని, ఒక మేనేజ్మెంట్ కమిటీ, ఒక ఎడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదనలను రూపొందించాలని సి.ఎం.సూచించారు.
4.జలవనరుల శాఖ….
-నాగావళి నదిపై సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్ట్ ఎడమవైపు హెడ్ స్లూయిస్‌కు ఎడమవైపు 1.0 మెగావాట్ల మినీ హైడల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన M/s మే ఎన్‌కాన్స్ (P) లిమిటెడ్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
5.జలవనరుల శాఖ….
-నాగావళి నదిపై సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్ట్ ఎడమ హెడ్ స్టూయిస్‌కు కుడివైపున 2.7 మెగావాట్ల మినీ హైడల్ స్కీమ్‌ను ఏర్పాటు చేయడానికి M/s మే ఎన్‌కాన్స్ (P) లిమిటెడ్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-ఈ మినీ హైడల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ అనుకూల గ్రీన్ పవర్ ఉత్పత్తికి అవకాశం కలుగుతుంది.
-ప్రాజెక్ట్ సమీప ప్రాంతాల్లో వోల్టేజ్ పరిస్థితులను మెరుగుపడటంతో పాటు స్థానికంగా ఉపాధి కల్పన, వ్యవస్థాపకత అభివృద్ధి మరియు నీటి రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం చేకూరనుంది.
-భవిష్యత్తులో ఏర్పాటు చేసే చిన్న చిన్న పవర్ ప్లాంట్లలో ఎస్.హెచ్.జి. మహిళలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఉపాధి కల్పిస్తూ మహిళా సాధికారత సాధనకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
6.జలవనరుల శాఖ….
-గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం తాడేపల్లి గ్రామ పరిధిలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదికి కుడి మార్జిన్ లో 0.9 KM నుండి 2.61 KM వరకు వరద రక్షణ గోడ నిర్మాణ పనులకు రూ.294.20 కోట్లతో పరిపాలన అనుమతి మంజూరీ కోసం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-ప్రతి ఏడాది వర్షాకాలంలో కృష్ణా నది వరద ఉదృతి కారణంగా తాడేపల్లి పరిధిలోని సుందరయ్య నగర్, మహాబాడు కాలనీ తదితర ప్రాంతాలు ముంపునకు గురై బడుగు, బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వరద సమయంలో ఈ ముంపు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక పునరావాస కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తున్నది.
-విజయవాడ వద్ద కృష్ణా నది ఎడమవైపు మార్జిన్ లో వరద రక్షణ గోడను నిర్మించడం వల్ల గత ఏడాది సెప్టెంబరులో కృష్ణా నది వరద సమయంలో 11.43 లక్షల క్యూసిక్కుల వరద ప్రవాహం వచ్చినప్పటికీ కృష్ణ లంక, రాణీగారి తోట తదితర పల్లపు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా కాపాడటం జరిగింది.
-ఇదే తరహాలో కృష్ణా నది కుడివైపు మార్జిన్ లో ప్రకాశం బ్యారేజ్ దిగువన కూడా శాశ్వత ప్రాతిపదికన వరద రక్షణ గోడను నిర్మించాలని తాడేపల్లి పరిధిలోని సుందరయ్య నగర్, మహాబాడు కాలనీ తదితర పల్లపు ప్రాంతాల ప్రజలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ వరద రక్షణ గోడ నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
7.రెవిన్యూ శాఖ ( రెవిన్యూ & స్టాంప్స్)….
-A.P. ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APICDC) – స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) కు వైఎస్ఆర్ కడప జిల్లా సి.కె.దిన్నె మండలం కొప్పర్తి మరియు తాడిగొట్ల గ్రామాల్లోని 2,595.74 ఎకరాల భూమిని APIIC బదిలీ చేసేందుకు అవసరమైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ కు ఇండియన్ స్టాంప్ యాక్ట్, 1899లోని సెక్షన్ 9(1)(ఎ) కింద స్టాంప్ డ్యూటీని మరియు రిజిస్ట్రేషన్ చట్టం, 1908 సెక్షన్ 78 కింద రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించడానికి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
8.రెవిన్యూ శాఖ ( రెవిన్యూ & స్టాంప్స్)….
-A.P. ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APICDC) – స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) కు కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం మీదివేముల, ఉప్పలపాడు మరియు ఎన్.కొంతలపాడు గ్రామాల్లోని 2,621.15 ఎకరాల భూమిని APIIC బదిలీ చేసేందుకు అవసరమైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ కు ఇండియన్ స్టాంప్ యాక్ట్, 1899 లోని సెక్షన్ 9(1)(ఎ) కింద స్టాంప్ డ్యూటీని మరియు రిజిస్ట్రేషన్ చట్టం, 1908 సెక్షన్ 78 కింద రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించడానికి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
9.రెవిన్యూ శాఖ (ల్యాండ్స్)….
-G.O.Ms.No.84, Dt:24.02.2023 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూముల క్రమబద్దీకరణకై ధరఖాస్తుల ధాఖలు సౌకర్యం మరియు 22(a) కింద నిషేధిత ఆస్తులుగా నోటిఫై చేయబడి భూముల క్రమబద్ధీకరణ కోసం నిబంధనలు & షరతులకు అనుగుణంగా సంబంధిత రుసుము చెల్లించడం ద్వారా మిగిలిన ధరఖాస్తుల స్వీకరణ గడువును తే.31.12.2025 దీ వరకు పొడిగించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
10. రెవిన్యూ శాఖ (ల్యాండ్స్)….
-“పేదల అందరికీ ఇళ్లు ” అనే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ కింద గ్రామీణ ప్రాంతాల్లో @ 3 సెంట్లు మరియు పట్టణ ప్రాంతాల్లో @ 2 సెంట్లతో ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-ఈ పథకానికి బి.పి.ఎస్. కుటుంబాల వారు అర్హులు మరియు వారు ఇంతకు ముందు ఏ ప్రభుత్వం లోనూ కూడా గృహ నిర్మాణ పథకం క్రింద గృహ నిర్మాణ ఋణాన్ని పొంది ఉండ కూడదు మరియు తప్పని సరిగా ఆధార్ కలిగి ఉండాలి.
-మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు మరియు మాగాణి ప్రాంతంలో 2.50 ఎకరాలకు మించి ఉండ కూడదు.
-గత ప్రభుత్వ హయాంలో నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, అయితే చాలా మంది ఆ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకోవడం జరుగలేదు. అటు వంటి కేటాయింపులు అన్నింటినీ రద్దు చేసి తిరిగి వారందరికీ ఈ పథకం క్రింద ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది.
-కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలను ఆసరాగా చేసుకుని ఈ కాలనీల్లో మౌలిక వసతులను మెరుగు పర్చనున్నాము.
11. రెవిన్యూ శాఖ….
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాలలో అర్హులైన నిరుపేదలు తేదీ.15.10.2019 నాటి నిర్మించుకున్న నివాస గృహాలను క్రమబద్దీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-ఇందుకు సంబందించి గతంలో జారీ చేసిన GO లను అన్నింటినీ సూపర్ సీడ్ చేస్తూ ప్రస్తుతం మండలి తీసుకున్న నిర్ణయం అమల్లోకి రానుంది.
12. గ్రామ సచివాలయం & వార్డు సచివాలయం శాఖ….
-గ్రామ/వార్డు స్థాయిలో రియల్ టైమ్ గవర్నెన్సుని మరింత సమర్థవంతంగా అమలు చేయడం మరియు స్వర్ణ ఆంధ్ర విజన్ @ 2047 సాధించడం కోసం గ్రామ/వార్డు సెక్రటేరియట్‌లు మరియు ఫంక్షనరీల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. – గత ప్రభుత్వం రాష్ట్రంలో 11,162 గ్రామ సచివాలయాలను మరియు 3,842 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది.
-11 మందిని గ్రామ సచివాలయంలోను మరియు 10 మందిని వార్డు సచివాలయాల్లోనూ ఉద్యోగులుగా నియమించడం జరిగింది.
-ఎటు వంటి ఆలోచన, ముందు చూపు లేకుండా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించడం లేదనే అభిప్రాయం నెలకొని ఉంది.
-ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గ్రామ, వార్డు సెక్రటేరియట్లను మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది. 3,501 జనాభాకు పై బడి ఉన్న సచివాలయాన్ని A కేటగిరీగా, 2,501 నుండి 3,500 వరకూ జనాభా ఉన్న సచివాలయాన్ని B కేటగిరీగా మరియు 2,500 జనాభా లోపు ఉన్న సచివాలయాన్ని C కేటగిరీగా విభజించడం జరిగింది.
-3,501 జనాభాకు పై బడి ఉన్న సచివాలయంలో ఎనిమిది మంది ఉద్యోగులను, 2,501 నుండి 3,500 వరకూ జనాభా ఉన్న సచివాలయంలో ఏడుగురిని మరియు 2,500 జనాభా లోపు ఉన్న సచివాలయంలో ఆరుగురు ఉద్యోగులను కేటాయించండ జరిగింది.
-మల్టీ పర్పస్ ఫంక్షణరీస్, టెక్నికల్ ఫంక్షణరీస్ మరియు ఆస్పిరేషనల్ ఫంక్షణరీన్ గా ఈ ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించడం జరిగింది.
-డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్సు, ఐఓటి తదితర సాంకేతిక విధానాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఆస్పిరేషనల్ ఫంక్షణరీన్ ను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
-టెక్నికల్ ఫంక్షణరీస్ వ్యవసాయ, పంచాయితీరాజ్ శాఖలకు అనుసంధానంగా ఉంటారు. జి.ఏ.డి. ప్రిన్సిఫల్ సెక్రటరీ ద్వారా ఆ ఫంక్షణరీస్ సేవలను ఆయా శాఖలు పొందవచ్చు.
-గ్రామ సచివాలయాల ఉద్యోగులకు పంచాయితీ సెక్రటరీ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వార్డు ఎడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్ గా ఉంటారు.
-సర్ప్లెస్ ఉద్యోగులను వారి అర్హతకు తగ్గట్టుగా మరో శాఖల్లో సర్థుబాటు చేయడం జరుగుతుంది.
-ఈ విధానాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
-రెవిన్యూ మంత్రి చైర్మన్ గా పురపాల మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రులు, కార్యదర్శులు సభ్యులుగా రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
-జిల్లా స్థాయిలో ఇన్ చార్జి మంత్రి చైర్మన్ గా జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు సభ్యులుగా జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది.
13. స్టేటస్ నోట్స్ (చర్చనీయాంశాలు)….
-(i) ఫ్రీహోల్డ్ భూములు (ii) రిజిస్ట్రేషన్ చట్టం, 1908 లోని నిషేధిత ఆస్తుల జాబితా 22-A(1)(a) నుండి (e) వరకు ఉన్న భూముల తొలగింపు మరియు (iii) G.O.Ms.No.571 మరియు రిజిస్ట్రేషన్ చట్టం, 1908 లోని 22-A(1)(b) లోని BSO (24) జాబితాలో బదిలీ చేయబడిన భూముల తొలగింపు అంశాలపై ఈ మంత్రి మండలి సమావేశంలో చర్చించడం జరిగింది.
-22A లో తొలగించిన భూములు, పట్టా భూములు, ఇనాం భూములు గానీ మొత్తం 13.59 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 13.57 లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం వెరిఫై చేయిండం జరిగింది.
-కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఈ భూములను హస్తగతం చేసుకునేందుకు చాలా భూములను ప్రీ హోల్డ్ చేయడానికి ప్రయత్నించడం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
-ఈ సమస్యలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పేద వానికి ఎటు వంటి అన్యాయం జరుగకుండా, భూములు అన్యాక్రాంతం కాకుండా, పారిశ్రామిక అవసరాలకు, నిరుపేదల ఇళ్ల స్థలాలకు ఈ భూములను వినియోగించే విధంగా చర్చకు తీసుకురావాలని అధికారులకు సూచించడం జరిగింది.
-రీ-సర్వేలో కూడా చాలా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి, వీటన్నింటిపై పూర్తి స్థాయిలో సమీక్షించి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
-రాష్ట్ర ఆదాయాన్ని, ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా పెంచాలనే అంశంపై కూడా ఈ క్యాబినెట్ లో చర్చించడం జరిగింది. స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చేందుకు పూర్తి స్థాయిలో అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించడం జరిగింది.
-ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతం కావాలని మంత్రి మండలి సభ్యులు అందరూ ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.