-విజయ వాడ సెంట్రల్ శాసనసభ సభ్యులు, ప్రభుత్వం విప్ బోండా ఉమా మహేశ్వర రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారి భద్రతా మాసం సందర్భముగా రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ యన్ టి ఆర్ జిల్లా ప్రాంతీయ అధ్యక్షులు బేతు రామ మోహన్ రావు ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రచార సామాగ్రి కరపత్రాలు, గోడ పత్రాలని విజయ వాడ సెంట్రల్ శాసనసభ సభ్యులు బోండా ఉమా మహేశ్వర రావు ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహన వినియోగ దారులు తప్పని సరిగా రహదారి భద్రతా పై అవగాహన కలిగి ఉండాలి అని , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నారు అని రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ సంస్థ తరుపున యన్. టి. ఆర్. జిల్లాలో బేతు రామ మోహన రావు అనేక రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించిబాగా పనిచేస్తున్నారు అని ఈ సంవత్సరం సడక్ సురక్ష జీవన్ రక్ష అనే నినాదం తో ప్రచార సామాగ్రిని నా చేతులు మీదుగా ప్రారంభించటమ్ చాలా సంతోషం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యన్ టి ఆర్ జిల్లా ప్రాంతీయ అధ్యక్షులు బేతు రామ మోహన్ రావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఒక మహిళ ఆర్. కె. దుర్గ పద్మజ గారి నేతృత్వంలో ఈ జిల్లా అధ్యక్షులు గా పనిచేసి సంస్థ కి మంచి పేరు తెస్తున్నానని అని, పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు సేఫ్టీ యన్ జి ఓ రాష్ట్ర అధ్యక్షురా లు ఆర్. కనక దుర్గ పద్మజ, సభ్యులు బంగారయ్య, కోటేశ్వర రావు పాల్గొన్నారు.