Breaking News

స్టార్ హోటల్స్ కు అనుకూలమైన ఎక్సైజ్ పాలసీ అమలు చేయాలి

– ఏపీ హోటల్స్ అసోసియేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని స్టార్ హోటల్స్ కు అనుకూలమైన ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి కోరారు. ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి, తాజ్ గేట్ వే అధినేత రాజయ్య, మురళీ ఫార్సూనర్ అధినేత ముత్తవరపు మురళీ లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం రాత్రి సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిచారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి సీఎం శ్రీ. నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పలు విషయాలను తీసుకువచ్చారు. పక్క రాష్ట్రాలైన తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర లలో అమలవుతున్న ఎక్సైజ్ పాలసీ జీవో లను చూపించి, మన రాష్ట్రంలో ఏడాదికి ఎక్సైజ్ ఫీజు రూ. 68 లక్షలు ఉందని, కావున సవరించాలని కోరారు. అలాగే రన్నింగ్ లో ఉన్న హోటల్స్ కు ఇండస్ట్రీ స్టేటస్ అమలు చేయాలని, విద్యుత్ రేట్లు తగ్గించాలని అలాగే మున్సిపల్ టాక్స్ లు తగ్గించాలని కోరారు. హోటల్స్ అసోసియేషన్ వారి విజ్ఞాపనలను విన్న సీఎం శ్రీ. నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. హోటల్స్ యాజమాన్యాలకు ఇబ్బంది లేకుండ ఎక్సైజ్ పాలసీని అమలు చేస్తామని హామి ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరుపై పర్యవేక్షణ కమిటీ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరుపై జిల్లా అభివృద్ది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *