గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరుపై జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ ( దిశా) సమావేశాన్ని శనివారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జెడ్పీ ఛైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ , శాసన మండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు తూర్పు , పశ్చిమ , ప్రత్తిపాడు , తాడికొండ శాసన సభ్యులు మహమ్మద్ నసిర్ అహ్మద్ , గళ్ళా మాధవి , బూర్ల రామాంజనేయులు , తెనాలి శ్రావణ్ కుమార్ , నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ గుంటూరు పార్లమెంట్ నియోకావర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించి సూచనలు అందజేశారు. గత ప్రభుత్వంలో నిలిపివేసిన అండర్ పాస్ బ్రిడ్జీలు 2026 జులై మాసాంతానికి పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి తెలియజేశారు. త్వరలో నందివెలుగు బ్రిడ్జ్ పనులు మొదలు పెడతామన్నారు. శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ కు ఏప్రిల్ మొదటి వారంలో శంఖుస్థాపన చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే జాతీయ రహదారుల విస్తరణ కోసం భూ సేకరణ డిపిఆర్ ల రూపకల్పనపై అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నుండి అమరావతికి చేరుకోవడానికి బైపాస్ రహదారి నిర్మాణం దాదాపు ఐదు నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం , ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో రెండు నెలల లోపు పూర్తి ఎలెన్ మెంట్ చేయడం జరుగుతుందని అధికారులు మంత్రికి తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ పనులకు వచ్చే నెల టెండర్లు పిలుస్తామన్నారు. రైల్వే బ్రిడ్జ్ ల నిర్మాణాన్ని రూ.110 కోట్లతో చేపడతామన్నారు. ఆర్ఓబి , ఆర్ యు బి ల నిర్మాణంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అమృత్ – 2 వాటర్ స్కీమ్ కు డిపిఆర్ లు సిద్దం చేయడం జరిగిందని, స్క్రూట్ని స్టేజ్ లో వుందని అధికారులు మంత్రికి తెలిపారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో పి యం జి యస్ వై పధకం క్రింద 12 రోడ్లు నిర్మాణానికి సిద్దంగా వున్నాయని మంత్రి పేర్కొన్నారు.
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ మాట్లాడుతూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు జరిగే పధకాలన్నింటిని ప్రజాప్రతినిధుల , అధికారులతో ప్రతి మూడు నెలలో కొకసారి ఈ దిశా సమావేశం ద్వారా సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల నిర్మాణం పురోగతి , ఔటర్ రింగ్ పరిస్థితిపై సమీక్షించడం జరిగిందన్నారు. ఓటర్ రింగ్ రోడ్డు ఫైనల్ ఎలైన్మెంట్ ను 2025 జనవరి మాసాంతానికి అందిస్తామని అధికారులు తెలిపారు. అదే విధంగా ఫైనల్ ఎలైన్మెంట్ పెదకాకాని ఎంట్రీ , ఎగ్జిట్ రోడ్డు ఫిబ్రవరి 2025 నాటికి పూర్తి చేస్తామన్నారు. హైదారాబాద్ నుండి అమరావతికి వచ్చే బైపాస్ బ్రిడ్జ్ ఏప్రిల్ నాటికి పూర్తి అవుతుందని , బ్రిడ్జ్ పూర్తి అయేతే నేరుగా హైదరాబాద్ నుండి అమరావతికి రావచ్చన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అండర్ పాస్ బ్రిడ్జ్ లు జులై 2026 నాటికి పూర్తి చేయడం జరుగుతుందని, దానిపై రూ.400 కోట్ల భారం పడుతుందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.110 కోట్లతో వచ్చే నాలుగు నెలలలో ఎస్టీమేషన్లు , టెండర్లు , శంఖుస్థాపనలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే అసంపూర్తిగా వున్న నందివెలుగు బ్రిడ్జ్ కి ఎస్టిమేషన్ అడిగామని , కాంట్రాక్టర్ కు రూ.10 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి వుందని , అదనంగా మరో రూ.30 కోట్లు అయితే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయవచ్చన్నారు. ఇందుకు సంబంధించి డిపి ఆర్ లు సిద్దం చేయమని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అదే విధంగా శ్యామల నగర్ బ్రిడ్జ్ ని రెండు లైన్లకు పరిమితం చేయడం జరిగిందన్నారు. మంగళగిరి , పెదపలకలూరు బ్రిడ్జ్ లకు డిపిఆర్ లు పూర్తి అయ్యాయన్నారు. వాటిని సెంట్రల్ రైల్వే అధికారులకు పంపడం జరుగుతుందన్నారు. పి యం జి యస్ వై క్రింద గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 12 రోడ్లు చేపట్టవలసి వుందని , వీటిపై సమీక్షించడం జరిగిందని , రెండు , మూడు వారాల్లో డిపిఆర్ లు సిద్దం చేయాలని అధికారులకు తెలిపామన్నారు. గుంటూరు పట్టణానికి కావలసిన త్రాగునీటికి అమృత్ – 2 పధకం క్రింద రూ. 184 కోట్లతో ఒకటి , మరొక ప్రాజెక్ట్ కు రూ.25 కోట్లతో చేపట్టే కార్యక్రమంపై సమీక్షించడం జరిగిందని , అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పరిస్థితిపై సమీక్షించడం జరిగిందన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి , ముఖ్యమంత్రి నారాచంద్ర బాబు నాయుడు గారికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి విడుదల చేసిన దాదాపు పది వేల కోట్లపై నిధులు విడుదల సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా అందనన్ని నిధులు అందుతున్నాయని తెలుపుతూ , ఔటర్ రింగ్ రోడ్డుకు 17 వేల కోట్ల నుండి 20 వేల కోట్ల వరకు నిధులు వస్తున్నాయన్నారు. రైల్వే బ్రిడ్జ్ లు, పోలవరం ప్రాజెక్ట్ , అమరావతి నిర్మాణం వంటి అనేక అభివృద్ది పనులకు నిధులు కేంద్రం నుండి అందుతున్నాయన్నారు. ఇందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సహకరించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు వేసిన ఓట్లు , ఆయన సహనం వల్లే సాధ్యమవుతున్నదన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ షేక్. ఖజావలి , జెడ్పి సిఇఓ జ్యోతిబసు, ఆర్ డి ఓ కే. శ్రీనివాస రావు , ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్.ఈ కళ్యాణ్ చక్రవర్తి , ఆర్ అండ్ బి ఎస్. ఈ శ్రీనివాస మూర్తి , పీడీ డీఆర్డీఏ విజయలక్ష్మీ , పీడీ డ్వామా శంకర్ , పీడీ హౌసింగ్ ప్రసాద్, పంచాయితీ రాజ్ ఎస్. ఈ బ్రహ్మయ్య, మత్స్య శాఖ డిడి గాలిదేముడు , జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు, డీటీసీ సీతారామిరెడ్డి , డిపిఓ బి.వి.నాగసాయి కుమార్ , డియం అండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మీ, డిఇఓ రేణుక, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రభుత్వ ఆదేశాల మేరకు ” స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్చ దివాస్ “
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆదేశాల మేరకు ” స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్చ దివాస్ ” …