విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడిపి యువనేత దివంగత పొట్నూరి అజయ్ కుమార్ ప్రథమ వర్ధంతి వేడుకలు కొత్తపేట కోమలా విలాస్ ప్రాంతంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
సోదరుడు పొట్నూరి కేశవ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రథమ వర్ధంతి సంస్మరణ సభలో శాసనమండలి మాజీ సభ్యులు బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ జనసేన నేత అమ్మిశెట్టి వాసు , స్థానిక నేతలు పాల్గొని అజయ్ కుమార్ కు నివాళులర్పించారు.
బుద్దా వెంకన్న పోట్నూరి అజయ్ సేవలను కొనియాడారు . పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వివాద రహితుడిగా గుర్తింపు పొందిన అజయ్ చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి మరణించడం బాధాకరమన్నారు. ఆయన స్ఫూర్తితో
సోదరుడు పొట్నూరి కేశవ క్యాన్సర్ బాధితులకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు.
అనంతరం మహిళలకు చీరలు, దుస్తులు, పండ్లు పంచిపెట్టారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించి
క్యాన్సర్ బాధితులకు ఆర్థిక సాయం అందించారు.
ఈ సంతాప సభలో కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు, మహాదేవు అప్పాజీరావు, మరుపిళ్ళ రాజేష్, టిడిపి డివిజన్ ప్రెసిడెంట్ కొప్పుల గంగాధర్ రెడ్డి, జనసేన నాయకులు ఎన్ కనక తదితరులు పాల్గొన్నారు.
