విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజా శేఖర బాబు ఐ.పి.ఎస్. కి రాబడిన పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏ.డి.సి.పి ఏ. శ్రీనివాస రావు పర్యవేక్షణలో ఏ.సి.పి. కె. లతాకుమారి, నార్త్ ఏ. సి. పి. స్రవంతి రాయ్ ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు నున్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి ది. 01.03.2025 తేదీన సులభంగా డబ్బులు సంపాదించడం కోసం పిల్లలు లేని వారిని/సంతానలేమితో బాధపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని అక్రమంగా చిన్న పిల్లలను విక్రయించు ఐదుగురు మహిళలను అడుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన ముగ్గురు పిల్లలను స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేసిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏ.సి.పి. కె.లతాకుమారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బందితో కలిసి నిందితులు విక్రయించిన మరొక బేబిని రాజమండ్రి సీతానగరం సమీపంలో రెస్క్యూ చేసి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించడం జరిగింది.
Prajavartha Online Telugu News