-టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్
-ఎన్డీయే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.788 కోట్లు
-విద్యార్దుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసిపి కి లేదు
-విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం
-ప్రచార ఆర్భాట కోసం చేసే ఫీజు పోరు అట్టర్ ఫ్లాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో విద్యార్ధుల తరఫున పూర్తిగా ఫీజులు కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం నేరుగా అందజేసేంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలో వచ్చిన జగన్ విద్యార్ధుల జీవితాలను జగనన్న విద్యా దీవెన పేరుతో అంథకారం మార్చాడు. ప్రచార్బాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్ధుల్ని, వారి తల్లితండ్రుల్ని మోసం చేశాడు. 2014-2019 టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ చేస్తే జగన్ రెడ్డి పాలనలో కేవలం 9 లక్షల మందికి అది కూడా విడతల వారీగా ఇచ్చి, దాదాపు 7 లక్షల మంది పేద విద్యార్ధులను విద్యు దూరం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మండిపడ్డారు.
ఫిబ్రవరి 5వ తేదీన వైసిపి నాయకులు తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ, ఫీజు పోరు పోస్టర్ రిలీజ్ సందర్బంగా వైసిపి మాజీ మంత్రులు విద్యార్ధులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మాట్లాడుతూ వైసిపి నాయకులందరూ “ఫీజుపోరు” లో జగన్ ఐదేళ్లలో పెట్టిన బకాయిల కుప్ప గురించి వివరించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా కాలేజీలకే నేరుగా ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాలకే అంటూ తన రాజకీయ అవసరాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
పేద విద్యార్థులకు చదువు, ఉద్యోగాలు రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అంటూ విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను భిక్షగాళ్లతో పోలుస్తూ మాట్లాడిన వైసిపి నాయకులు ముందుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ప్రజలను, విద్యార్ధులను గౌరవించటం తెలియని వైసీపీ నేతలకు అసలు నాయకులుగా కొనసాగే అర్హత లేదన్నారు.
ఇవ్వని ఫీజులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ – రూ.2,832 కోట్లు ఇచ్చినట్లు పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు ఇచ్చుకుని బాకా కొట్టుకుంది ఎవరూ? అంటూ ప్రశ్నించారు. వసతి దీవెన బకాయిలు – రూ.989 కోట్లు, పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ – రూ.450 కోట్లు బకాయిల కుప్పపెట్టి ఆ సొమ్ముంతా దోచుకున్న నాయకులు విద్యార్ధుల జీవితాలతో ఆడుకోవటానికి ఫీజు పోరు అంటూ మరో కొత్త డ్రామాకి తెరదీశారన్నారు. వైసిపి నాయకులు ఉనికి కోసం చేసే దొంగ పోరులను ప్రజలు, విద్యార్ధులు నమ్మటానికి సిద్దంగా లేరని తెలిపారు. ఇటీవల వైసిపి చేసిన రైతు పోరు అట్టర్ ఫ్లాప్ అయినా వై.ఎస్.జగన్ కి ఇంకా బుద్ది రాలేదన్నారు. ఫీజు పోరు కూడా అంతకుమించి అట్టర్ ఫ్లాప్ కానుందన్నారు.
జగన్ రెడ్డి అధికారంలో వున్ననాడు ఏ రోజు విద్యార్ధులను నేరుగా కలిసి వారి ఇబ్బందులు గురించి తెలుసుకున్నది లేదని..అంతా పరదాల వెనకే వుంటూ జగన్ కేవలం బటన్ మాత్రమే నొక్కేవాడని..ఆ డబ్బులు ఎవరి ఖాతాలో పడేవో ఆ భగవంతుడికే తెలియాలన్నారు. జగన్ పాలనలో ఎంతో మంది విద్యార్ధులను ఫీజు విషయంలో కళాశాల యాజమన్యాలు వేధించాయి. కొన్ని చోట్ల హాల్ టిక్కెట్లు నిలిపివేసి, పరీక్షలు రాయకుండా విద్యార్దులను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఫీజులు చెల్లించలేక రాష్ట్రంలో విద్యార్ధులు ఆత్మహత్యకు ప్రయత్నించిన పాపాం వైసిపి నాయకులదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయంలో విద్యార్ధులు భోజనం బాగోలేదంటూ విజయవాడ కలెక్టర్ ఆఫీస్ ముందుకి వచ్చి ధర్నా చేశారు..ఆ రోజు వైసిపి నాయకులు విద్యార్ధుల గురించి ఎందుకు మాట్లాడలేదో సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు.
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో రూ.788 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసిందన్నారు.. విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పదవీ బాధ్యతులు చేపట్టిన తర్వాత వివిధ కళాశాలల్లో నిలిచిపోయిన 10లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. విద్యార్థులను ఫీజు కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కాలేజీలకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు.
గత 5 ఏళ్లకు రూ.4,271 కోట్లు ఫీజు బకాయిలు పెట్టిన జగన్ రెడ్డి, విద్యార్ధుల కోసం పోరాటం చేస్తానని చెప్పటం హాస్యస్పదంగా వుందన్నారు. జగన్ సిద్దం అంటే…విద్యార్ధులందరూ ఒకేమాట మీద నిలబడి సిద్ధమై ఇంటికి పంపించారు. ఈ విషయం వైసిపి నాయకులు గ్రహించకపోవటం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా పదవీబాధ్యతలు తీసుకున్న నాటి నుంచి విద్యా వ్యవస్థలో అనేక వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టూరు. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టారు. విద్యార్ధులతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుని వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చుతున్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రపంచ స్థాయి యూనివర్శిటీలను రాష్ట్రానికి తీసుకురావటానికి కృషి చేస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగర టి.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులు వడ్లమూడి వంశీ, సాయిరాము, రవి, బాలతో పాటు తదితరులు పాల్గొన్నారు.