Breaking News

నిరుద్యోగ యువత కొరకు అనేక శిక్షణ కార్యక్రమలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్థలం: స్వీమ్స్ నర్సింగ్ కళాశాల-తిరుపతి,
తేది: 01-03-2025.

విషయము: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారిచే నిర్వహించబడుతున్న స్కిల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ మరియు ప్లేస్మెంట్స్ నర్సస్ టు జర్మన్ అను ఉచిత శిక్షణా కార్యక్రమమును పర్యవేక్షించిన మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -ఏపీఎస్ఎస్ డిసి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కొరకు అనేక శిక్షణ కార్యక్రమలు చేపడుతుంది ఇందులో భాగంగా భవిష్యత్లో హెల్త్ కేర్ సెక్టార్ నందు వివిధ దేశాల్లో ఉన్న నర్సింగ్ ఉద్యోగాల కొరకై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ విద్యార్థులకు స్కిల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ మరియు ప్లేస్మెంట్స్ కార్యక్రమంలో భాగంగా జర్మన్ భాష పై 18 జనవరి నుండి ప్రారంభించి, ఆరు నెలల ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించి కనీసం నెలకు 2.5లక్షల నుండి 3.5లక్షల రూపాయలు జీతంతో కుడినటువంటి ఉద్యోగా అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా కల్పిస్తున్నామని కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అకాడమి క్ నర్సింగ్ విద్యార్థులకు వివిధ దేశాలలో నర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్- ఏపీఎస్ఎస్ డిసి వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మరో అతిథిగా శ్రీనివాస్ రీజినల్ చీఫ్ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, తిరుపతి ఎంప్లాయిమెంట్ బ్యూరో జర్మన్ భాష పై శిక్షణ పొందుతున్న యువతకు శిక్షణ కార్యక్రమంలోని మెలకువలు హెల్త్ సెక్టార్ పై కెరియర్ గైడెన్స్ మరియు ఉపాధి అవకాశాలను శిక్షణ పొందుతున్న యువతకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మరో అతిథిగా ప్రో. సుధారాణి, ప్రిన్సిపల్ స్విమ్స్ కళాశాల నందు నర్సింగ్ విద్యార్థులకు ఉచిత శిక్షను ఇవ్వడం చాలా శుభపరిణామం అని మరియు తమ సంస్థ ద్వారా భవిష్యత్తులో అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తున్నామని తెలిపారు.

ఏపీఎస్ఎస్ డిసి ద్వారా రానున్న రోజులో మరింత మంది యువతకు అడ్వాన్సుడ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆర్. లోకనాథం, డి ఎస్ డి ఓ, తిరుపతి జిల్లా వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హరికృష్ణ, జర్మన్ భాష, ట్రైనర్, పి. మురళి కృష్ణ , ఏడిఎస్డిఓ, యు దిలీప్ కుమార్, సులేమాన్ భాష తిరుపతి జిల్లా వారి సిబ్బంది మరియు జర్మన్ భాష పై శిక్షణ పొందుతున్న యువత పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *