Breaking News

పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల నిర్వహణపై తగు సూచనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ది . 05-03-2025న వార్డు పర్యటనలో భాగంగా కృష్ణలంక ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రాంతాలను పరిశీలించి, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల నిర్వహణపై తగు సూచనలు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు, ప్రధాన నగర ప్రణాళికాధికారి (సీసీపీ) కూడా పలు కీలక సూచనలు చేశారు. ఈ సూచనల అమలుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, నిర్దేశిత సమయంలో C&D waste, శిథిలాలు, పోస్టర్లు, బ్యానర్లను తొలగించేందుకు పట్టణ ప్రణాళిక విభాగం చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు 16, 17, 20, 21 డివిజన్లలో C&D వ్యర్థాలు, అనధికార బ్యానర్లను తొలగించారు.
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టిపిఓ) గిరి, ఇంచార్జ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు మరియు వార్డు ప్లానింగ్ కార్యదర్శులు ఈ చర్యలలో పాల్గొన్నారు. అనుమతులు లేకుండా ఎటువంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజల నుండి సమస్యలను తెలుసుకుని, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *