-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనసభ్యుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయండి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్ లో గల ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి 18 నుండి 20, 2025 వరకు జరిగే గౌరవనీయులైన శాసనసభ్యుల క్రీడల పోటీల కొరకు ఎటువంటి లోపం లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. క్రీడల పోటీల నిర్వహణ లో విజయవాడ నగరపాలక సంస్థ వారి తరఫునుండి కావాల్సిన ప్రతి ఏర్పాటును ఎటువంటి అంతరాయం లేకుండా సత్వరమే పూర్తి చేయాలన్నారు. మధ్యాహ్నం మూడు నుండి మొదలయ్యే క్రీడల పోటీలకు రాత్రిపూట అవసరమయ్యే ఫ్లడ్ ఫ్లైట్లను ఏర్పాటు చెయ్యాలన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథరెడ్డి, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.